అయితే ఇంతటి అభిమానం పట్ల మెగాఫ్యామిలీ కూడా ఆశ్చర్యపోతుంటారట. దీనిపై నాగాబాబు స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పవన్‌కి ధైర్యం ఎక్కువ. భయం అనేది తెలియదు, ఎవరికీ భయపడడు. అదే సమయంలో సేవా తత్వం. ఇప్పటి వరకే ఎన్నో దానాలు, సహాయాలు చేశాడు.అవన్నీ బయటకు రావు, చాలా సైలెంట్‌గా హెల్ప్ చేస్తాడు. బయటకు చెప్పాలనుకోడు. అదే అతనిలో ఉన్న గొప్ప లక్షణం. ఎంతో పెద్ద స్టార్స్ ఉన్నా, ఇంతటి క్రేజ్ పవన్‌కి ఉండటానికి కారణం ఆ సేవ తత్వమే, ఫిల్టర్ లేని ఆ మనస్తత్వమే అని తాను భావిస్తానని తెలిపారు నాగబాబు.