Janaki Kalaganaledu: ఇంటికి వారసుడి కోసం తొందరపడుతున్న జానకి.. రామ మాటలు వినేసిన జ్ఞానాంబ!

Published : Jul 07, 2022, 01:50 PM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారం అవుతున్న జానకి కనగలేదు (Janaki Kalaganaledu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. పైగా మంచి కథతో ప్రసారమవుతూ రేటింగ్ లో కూడా పరవాలేదు అన్నట్టుగా అనిపిస్తుంది. ఇక ఈరోజు జులై 7 ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
17
Janaki Kalaganaledu: ఇంటికి వారసుడి కోసం తొందరపడుతున్న జానకి.. రామ మాటలు వినేసిన జ్ఞానాంబ!

ఎపిసోడ్ ప్రారంభంలోనే.. జానకి (Janaki) తన భర్త రామతో భార్యగా తనతో గడపట్లేదు అనే విషయాన్ని పంచుకుంటుంది. అంతేకాకుండా మీ కోరికలు తీర్చడం నా బాధ్యత అంటూ మన సంసార జీవితాన్ని మొదలు పెడదాము అని అంటుంది జానకి. కానీ రామ (Rama) మాత్రం మీరు ఇప్పుడు బాగా చదివి గొప్ప స్థాయికి చేరాలి అని అంటాడు.
 

27

ఇక జానకి (Janaki) తన అత్తయ్య కోరిక మేరకు ఈ ఇంటికి వారసుడిని ఇవ్వాలి అని అంటుంది. ఈ మాటలన్నీ జ్ఞానంబ (Jnanamba) చాటున ఉండి వింటుంది. అంతేకాకుండా తన మనసులో వాళ్లు మాట్లాడుకుంటున్న విషయం ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటుంది. ఇక ఉదయాన్నే జానకి రామతో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది.
 

37

ఇక ఎప్పుడు కొట్టుకే వెళ్తారా నేను భార్యను ఉన్నానని గుర్తుపెట్టుకోండి అని అంటుంది. ఆ తర్వాత రామ జానకితో తన లక్ష్యాన్ని పూర్తి చేసుకోమని ఆ తర్వాతే కాపురం గురించి ఆలోచిస్దాం అని అంటాడు. ఇక జానకి (Janaki) వంటగదిలో కూరగాయలు కట్ చేస్తూ ఉండగా గతంలో తనత తన అత్తయ్య జ్ఞానంబ (Jnanamba) మాట్లాడిన మాటలు తలుచుకుంటుంది.
 

47

పొరపాటున చేయి కట్ చేసుకుంటుంది. వెంటనే జ్ఞానంబ (Jnanamba) చూసి బాధపడుతూ గాయం మీద పసుపు పెడుతుంది. జ్ఞానంబ జానకిని (Janaki) చూసి.. ఎందుకు ఇలా ఉన్నావు అంటూ.. ఏం జరిగింది అని.. నేను వారసుడిని అడిగినప్పటి నుంచి నువ్వు కాస్త భయపడుతున్నట్లు కనిపిస్తున్నావు అని అంటుంది.
 

57

కానీ జానకి (Janaki) అలాంటిదేమీ లేదు అంటూ.. త్వరలో మీకు వారసుడిని ఇస్తాను అని మాట ఇస్తుంది. ఆ తర్వాత జ్ఞానంబ ఒంటరిగా కూర్చుని రామ, జానకి మాట్లాడిన మాటలు తలుచుకుంటుంది. వీరు ఏ విషయం గురించి ఆలోచిస్తున్నారు అని అనుకుంటుంది. ఆ తర్వాత జానకి అందంగా రెడీ అయి రామ (Rama) కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.
 

67

ఇక జానకి (Janaki) అంతా అందంగా రెడీ అవ్వటంతో మల్లికకు లేనిపోని అనుమానాలు వస్తుంటాయి. జానకి ఇలా రెడీ అయింది ఏంటి తనలోనే తనను ప్రశ్నలు వేసుకుంటుంది. ఇక రామ రావటంతో రామ (Rama) జానకి అందాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. పైగా ఇద్దరి మధ్య రొమాంటిక్ గా కనిపిస్తుంది.
 

77

తర్వాత రామ (Rama), జానకి గదిలోకి వెళ్ళగా మల్లిక (Mallika) మాత్రం వారిని ఒక కంట కనిపెడుతూ ఉంటుంది. ఇక గదిలోకి వెళ్లిన రామ జానకిని చూస్తూ అలాగే ఉంటాడు. తన అందాలను చూస్తూ మతి పోగొట్టుకుంటూ ఉంటాడు. ఆ తరువాత జానకి రామ దగ్గరకు రొమాంటిక్ గా వస్తుంది.

click me!

Recommended Stories