ఈరోజు ఎపిసోడ్ లో జ్ఞానాంబ గుడిలో నుంచి తీసుకువచ్చిన కలశాన్ని ఇంటి మధ్యలో పెట్టడంతో అందరూ ఏమీ అర్థం కాక అలాగే చూస్తూ ఉంటారు. అప్పుడు మల్లిక అత్తయ్య గారు ఎందుకు అత్తయ్య గారు కలిశాన్ని ఇంటి మధ్యలో పెట్టారు అని అడగగా అప్పుడు జ్ఞానాంబ మన ఇంటికి ఏదైనా దిష్టి ఉంటే తొలగిపోవడానికి ఈ కలశాన్ని ఇక్కడ ప్రతిష్టించాను అని అంటుంది. గుడిలో నేను తిన కొబ్బరికాయ కుళ్ళిపోయింది. అందుకోసం పరిహారంగా ఈ పని చేస్తే ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయని పంతులుగారు చెప్పారు అని అంటుంది.