ఈరోజు ఎపిసోడ్ లో జ్ఞానాంబ ఆరుబయట భోజనాలకు సిద్ధం చేస్తూ ఉండగా ఇంతలో గోవిందరాజులు అక్కడికి వచ్చి ఏంటి జ్ఞానం అప్పుడప్పుడు పెళ్లయిన కొత్తలో ఏర్పాటు చేస్తావు ఇప్పుడు మళ్లీ పెళ్లి రోజులు గుర్తుకు వచ్చాయా అని అడుగుతాడు. చాల్లే ఊరుకోండి పిల్లలు వింటే నవ్వుతారు అక్కడ పిల్లలు వస్తున్నారు మౌనంగా కూర్చుండి అని అంటుంది జ్ఞానాంబ. అప్పుడు విష్ణు ఏంటమ్మా ఏంటి స్పెషల్ ఈరోజు ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశావు అని అడగగా కూర్చొని చెప్తాను అని అంటుంది. ఈ మధ్యకాలంలో మనం సంతోషంగా ఉండి చాలా రోజులు అయింది.