అప్పుడు అందరూ అఖిల్ గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటారు. అప్పుడు జ్ఞానాంబ లాయర్ ఏమంటారో అఖిల్ కి బెయిల్ వస్తుందో లేదో అని టెన్షన్ గా ఉంది అండి అని అంటుంది. మరొకవైపు మల్లిక జెస్సి తల్లిదండ్రుల కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి జెస్సీ తల్లిదండ్రులు వస్తారు. అప్పుడు జెస్సీ వాళ్ళ తల్లిదండ్రులను చూసి ఎమోషనల్ అవుతూ వెళ్లి నాన్న అని గట్టిగా హద్దుకుంటుంది. ఇప్పుడు జెస్సి తల్లిదండ్రులు జెస్సి ఇ ఏమి కాదు జెస్సి ఏడవకు అని ఓదారుస్తూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి రామచంద్ర, విష్ణు వస్తారు.