Rip Krishna: ఎంతో మంది హీరోయిన్స్ తో నటించిన కృష్ణ ఇష్టపడ్డ హీరోయిన్ ఎవరో తెలుసా?

Published : Nov 15, 2022, 11:04 AM ISTUpdated : Nov 16, 2022, 09:28 AM IST

దశాబ్దాల పాటు సాగిన సుదీర్థ కెరీర్లో కృష్ణ అనేక మంది హీరోయిన్స్ తో నటించారు. కెరీర్ బిగినింగ్ నుండి తోడుగా నిలిచిన విజయనిర్మలను వివాహం చేసుకున్నారు. విజయనిర్మల తర్వాత కృష్ణకు ఇష్టమైన హీరోయిన్ మరొకరు ఉన్నారు.   

PREV
15
Rip Krishna: ఎంతో మంది హీరోయిన్స్ తో నటించిన కృష్ణ ఇష్టపడ్డ హీరోయిన్ ఎవరో తెలుసా?
Super Star Krishna

తేనె మనసులు మూవీతో కృష్ణ హీరోగా మారారు. ఆయనకు బ్రేక్ ఇచ్చిన చిత్రాల్లో సాక్షి ఒకటి. ఈ మూవీలో కృష్ణ అమాయకుడు, భయస్తుడు పాత్ర చేశాడు. కృష్ణను ప్రేమించే గడసరి అమ్మాయిగా విజయనిర్మల నటించారు. దర్శకుడు బాపు తెరకెక్కించిన బాపు సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

25
Super Star Krishna


ఆ సినిమాతో మొదలైన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. అయితే స్టార్ డమ్ వచ్చాక కృష్ణ కొందరు హీరోయిన్స్ తో రిపీటెడ్ గా సినిమాలు చేశారు. జయసుధ, జయప్రద, శ్రీదేవి వంటి హీరోయిన్స్ తో పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు. ఇప్పట్లో మాదిరి ముంబై నుండి అమ్మాయిలను దిగుమతి చేసుకునే కల్చర్ అప్పుడు లేదు. 

35
Super Star Krishna


తెలుగు, తమిళ అమ్మాయిలు హీరోయిన్స్ గా వెలిగిపోయేవారు. సావిత్రి, వాణిశ్రీ వంటి స్టార్స్ శకం ముగిశాక శ్రీదేవి, జయసుధ, జయప్రద వెండితెరను ఏలారు. జయప్రదతో కృష్ణ ఏకంగా 40కి పైగా చిత్రాలు చేశారు. 
 

45
Super Star Krishna


అయితే కృష్ణకు ఇష్టమైన హీరోయిన్ మాత్రం శ్రీదేవి అట. వీరిద్దరి కాంబినేషన్ లో 30 కి పైగా చిత్రాలు తెరకెక్కాయి. ఎంత బిజీగా ఉన్న శ్రీదేవి హీరోయిన్ అంటే డేట్స్ ఇచ్చేసేవాడట కృష్ణ. తన క్యాలెండర్ లో శ్రీదేవి కోసం కొన్ని డేట్స్ లాక్ చేసి ఉంచేవారట. 
 

55
Super Star Krishna


అంతగా శ్రీదేవిని కృష్ణ ఇష్టపడ్డారు. బుర్రిపాలెం బుల్లోడు, చుట్టాలొస్తున్నారు జాగ్రత్త, కృష్ణార్జునులు, బంగారు కొడుకు, పచ్చని కాపురం ఇలా పలు హిట్ చిత్రాల్లో కృష్ణ-శ్రీదేవి జతకట్టారు. సిల్వర్ స్క్రీన్ పై హిట్ ఫెయిర్ గా కృష్ణ-శ్రీదేవి పేరు తెచ్చుకున్నారు. 
 

click me!

Recommended Stories