ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..అఖిల్ రామతో, ఇన్ని రోజులు నేను తెలియక తప్పు చేశాను అన్నయ్య అని అంటాడు. దానికి రామా, ఇప్పుడు మనం ఎన్ని అనుకున్నా లాభం లేదు అఖిల్. రేపు ఉదయం అమ్మ నిర్ణయం చెప్తుంది అని అంటాడు. ఆ తర్వాత సీన్లో జ్ఞానాంబ, జానకి చెప్పిన విషయాలన్నీ గుర్తుతెచ్చుకుంటూ ఆలోచనలో పడి చికితతో చెప్పి కుటుంబం అందరినీ పిలవమని చెప్తుంది. అదే సమయంలో చికిత, మల్లికా విష్ణు గదిలోకి వెళ్లి అమ్మగారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని అంటుంది.