'గాడ్ ఫాదర్' ని కామెడీ చేశారు, కానీ.. మెగాస్టార్ కి భజన, దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన గెటప్ శ్రీను

Published : Oct 26, 2022, 12:52 PM IST

తాజాగా విడుదలైన ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో వైరల్ గా మారింది. బుల్లెట్ భాస్కర్, రాకింగ్ రాజేష్, ఇమ్మాన్యూల్ లాంటి కమెడియన్స్ చేసిన స్కిట్స్ నవ్వులు పూయిస్తున్నాయి. ఇక చివర్లో ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను కలసి చేసిన గాడ్ ఫాదర్ మూవీ కామెడీ పేరడీ ఆకర్షణగా నిలిచింది.

PREV
16
'గాడ్ ఫాదర్' ని కామెడీ చేశారు, కానీ.. మెగాస్టార్ కి భజన, దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన గెటప్ శ్రీను

ప్రధాన కమెడియన్స్ దూరం కావడంతో జబర్దస్త్ షో ప్రభావం కాస్త తగ్గింది. కానీ తిరిగి ఇటీవల కొందరు కమెడియన్లు జబర్దస్త్ లో పాల్గొంటున్నారు. తాజాగా విడుదలైన ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో వైరల్ గా మారింది. ఈ ఎపిసోడ్ కి సీనియర్ కమెడియన్ కృష్ణ భగవాన్, సీనియర్ హీరోయిన్ ఖుష్బూ జడ్జీలుగా వ్యవహరించారు.

26

బుల్లెట్ భాస్కర్, రాకింగ్ రాజేష్, ఇమ్మాన్యూల్ లాంటి కమెడియన్స్ చేసిన స్కిట్స్ నవ్వులు పూయిస్తున్నాయి. ఇక చివర్లో ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను కలసి చేసిన గాడ్ ఫాదర్ మూవీ కామెడీ పేరడీ ఆకర్షణగా నిలిచింది. అయితే గాడ్ ఫాదర్ ని కామెడీ చేసినట్లు అనిపించింది. 

36

గెటప్ శ్రీను చిరంజీవి గాడ్ ఫాదర్ లుక్ లో అదరగొట్టాడు. చిరంజీవి చెల్లి నయనతార పాత్రలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ నటించడం నవ్వులు పూయిస్తోంది. ఇక సత్యదేవ్ పాత్రలో ఆటో రాంప్రసాద్ నటించారు. సల్మాన్ ఖాన్ పాత్రలో బుల్లెట్ భాస్కర్ మెరిశాడు. నేను ఉన్నంతవరకు ఆ కామెడీ చైర్ కి చెద పట్టనివ్వను అంటూ గెటప్ శ్రీను చెబుతున్న డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. 

46

అన్నపూర్ణమ్మని గెటప్ శ్రీను నా చిట్టి చెల్లి అంటూ సంబోధించడం నవ్వులు పూయిస్తోంది. చిరంజీవి లాగా డైలాగులు చెబుతూ, స్టంట్స్ చేస్తూ కామెడీ చేశారు. గెటప్ శ్రీను గెటప్, డైలాగ్ డెలివరీ మొత్తం చిరంజీవిని తలపించేలా ఉంది. గెటప్ శ్రీను చిరంజీవికి వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. 

56

స్కిట్ ముగిసిన అనంతరం గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖుష్భూ మాట్లాడుతూ.. శ్రీను నడచి వస్తుంటే చిరంజీవి గారికి చూసినట్లే ఉంది అని ప్రశంసించారు. గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ లో భాగంగా శ్రీను చిరంజీవి గారితో కలసి ప్రైవేట్ జెట్ లో ప్రయాణించాడు. మావాడు చిరంజీవితో ప్రయాణించడంతో మా జబర్దస్త్ టీం మొత్తం వెళ్లినంత గర్వంగా ఫీల్ అయ్యాం అని ఆటో రాంప్రసాద్ తెలిపాడు. 

66

నేను చిరంజీవి గారి గురించి మాట్లాడుతుంటే చాలా మంది భజన చేస్తున్నాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు. వారికి ఒకటే చెబుతున్నా.. దేవుడికి భక్తుడు భజనే చేస్తాడు.. అంతకి మించి చేయలేదు అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. 

click me!

Recommended Stories