జేడీ చక్రవర్తి ఎక్కువగా మహేశ్వరితో సినిమాలు చేశారు. `గులాబీ`, `మృగం`, `దెయ్యం`లు వీరి కాంబినేషన్‌లో వచ్చాయి. `బొంబాయి ప్రియుడు`లో రంభతో, `ఎగిరే పావురం`లో లైలాతో, అలాగే సౌందర్య, ఉర్మిలా, మీనా, రాశీ, లయ, సాక్షి శివానంద్ ఇలా చాలా మంది టాప్ హీరోయిన్లతో చేశాడు జేడీ చక్రవర్తి. అయితే అప్పట్లో మంచి రొమాంటిక్ హీరోగా పేరుతెచ్చుకున్నాడు. ఆయన ఎక్కువగా థ్రిల్లర్ తరహా సినిమాలే చేసినా, కొన్ని లవ్ స్టోరీస్ కూడా చేసి మెప్పించాడు. తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళం, తమిళం భాషల్లో పలు చిత్రాల్లో నటించిన జేడీ.. చివరగా 2022లో 'కారీ' మూవీలో కనిపించారు. హిందీలో ఈ ఏడాదిలో వచ్చిన 'తాజా ఖబర్' అనే వెబ్ సీరీస్ లోనూ జేడీ చక్రవర్తి నటించారు.