సహజనటి జయసుధ గురించి పరిచయం అవసరం లేదు. 80 దశకంలో జయసుధ హీరోయిన్ గా ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించింది. ప్రస్తుతం జయసుధ టాలీవుడ్ లో తల్లి పాత్రలలో రాణిస్తున్నారు. తల్లి పాత్రలతో కూడా ఆమె తనదైన ముద్ర వేస్తున్నారు. బొమ్మరిల్లు, పరుగు, శతమానం భవతి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి చిత్రాలే అందుకు నిదర్శనం.