తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. కొన్నాళ్ల పాటు టాలీవుడ్ స్టార్ హీరోల సరసన హిట్ చిత్రాల్లో నటించి ఊపూపుంది. ప్రస్తుతం నార్త్ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. వరుసగా హిందీలో మెరుస్తూ తన సత్తా చాటుతోంది.
మరోవైపు సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ మైమరిపిస్తోంది. రీల్స్, వీడియోలు, గ్లామర్ ఫొటోలను తన అభిమానులతో షేర్ చేసుకుంటూ వారిని ఖుషీ చేస్తోంది.
ఈ సందర్భంగా లేటెస్ట్ ఫొటోషూట్ తో అట్రాక్ట్ చేస్తోంది. స్టైలిష్ వేర్ లో స్టార్ హీరోయిన్ చిలిపి పోజులకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ల్రైబ్రరీని తలపించే చిన్న గదిలో బుక్స్ అందంగా చదువుతూ నెటిజన్లను అట్రాక్ట్ చేసింది.
మరోవైపు ఆకర్షణీయమైన దుస్తుల్లో కట్టిపడేసింది. డెనీమ్ జీన్స్, బ్లూ క్రాప్డ్ టాప్, జీన్స్ షర్ట్ లో స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా నేలపై కూర్చొని ఫొటోలకు పోజులిచ్చింది. కిల్లింగ్ పోజులతో నెట్టింట దుమారం రేపింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. అటు ట్రెడిషన్ దుస్తుల్లో మెరుస్తూనే.. ఇటు వెస్ట్రన్ వేర్స్ లో మతులు పొగొడుతున్న రకుల్ ను అభిమానులతో పాటు నెటిజన్లు పొడుగుతూ ఆకాశానికి ఎత్తున్నారు. నెట్టింట సందడి చేస్తుండటంతో ఖుషీ అవుతున్నారు.
గతేడాది బాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఐదు హిందీ చిత్రాలు విడుదలైన విషయం తెలిసిందే. వాటి ఫలితాలు ఎలా ఉన్నా.. రకుల్ మాత్రం నార్త్ లో తన సత్తా చూపించిందనే చెప్పాలి. ఇక తెలుగులో చివరిగా ‘కొండపొలం’లో మెరిసింది.
ప్రస్తుతం తమిళంలో రూపుదిద్దుకుంటున్న Indian 2లో నటిస్తోంది. ఈ చిత్రంతో మళ్లీ దక్షిణాది ప్రేక్షకులను అలరించనుంది. తమిళ దర్శకుడు ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదే చిత్రంలో కాజల్ అగర్వాల్ కూడా నటించనుంది.