Jayaprada: ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లోనే బికినీ సీన్, ఏడ్చేసిన హీరోయిన్.. డైరెక్టర్ ఏం చేశారో తెలుసా

Published : Nov 06, 2026, 03:30 PM IST

జయప్రద తన సినీ కెరీర్ మొదట్లో షూటింగ్ సెట్‌లో ఏడ్చేసిన ఓ సంఘటనను గుర్తుచేసుకున్నారు. దర్శకుడు అడిగిన ఓ సీన్ చేయడానికి నో చెప్పిన ఆమె, ఆ తర్వాత తీసుకున్న నిర్ణయంతో 30 ఏళ్ల కెరీర్‌లో మళ్లీ అలాంటి దుస్తులు వేసుకోలేదట.

PREV
14
Jayaprada

సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద తన 30 ఏళ్ల సుదీర్ఘ సినీ, రాజకీయ ప్రయాణంలో జరిగిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. లెజెండరీ నటుడు శోభన్ బాబుతో తనకున్న అనుబంధం, జూనియర్ ఎన్టీఆర్‌పై ఉన్న గౌరవం, సీనియర్ దర్శకుడు దాసరి నారాయణరావుతో షూటింగ్ అనుభవాలు, అలాగే ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన తీరును వివరించారు.

24
"ఏడ్చేశాను.. బికినీ వేసుకోనని చెప్పేశాను"

తన వృత్తిపరమైన విలువల గురించి జయప్రద మాట్లాడుతూ.. "నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో దర్శకుడు దాసరి నారాయణరావు గారి సినిమాలో ఓ స్విమ్మింగ్ పూల్ సీన్ కోసం నన్ను బికినీ వేసుకోమన్నారు. అప్పటికి నేను చాలా చిన్న వయసులో ఉన్నాను. బికినీ వేసుకోవడానికి కచ్చితంగా కుదరదని చెప్పి సెట్‌లోనే ఏడ్చేశాను. నా పరిస్థితి అర్థం చేసుకున్న దాసరి గారు, బికినీకి బదులుగా నన్ను నీళ్లలో ఉన్న ఓ పెద్ద రబ్బరు టైరులో కూర్చోబెట్టి ఆ సీన్ తీశారు. ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం వల్ల, నా 30 ఏళ్ల సినీ ప్రయాణంలో ఏ ఒక్క సినిమాలోనూ అలాంటి పొట్టి దుస్తులు వేసుకోలేదు" అని ఆమె చెప్పారు.

34
'అత్తా' అని పిలిచే శోభన్ బాబు

దివంగత నటుడు శోభన్ బాబు తనను ఎంతో ప్రేమగా 'అత్తా' అని పిలిచేవారని జయప్రద గుర్తుచేసుకున్నారు. "షూటింగ్ సెట్‌లో ఆయన నన్ను కేవలం పలకరింపులకే పరిమితం చేయకుండా, సొంత కుటుంబ సభ్యురాలిలా చూసుకునేవారు" అని ఆమె అన్నారు. అలాగే, జూనియర్ ఎన్టీఆర్ కూడా పెద్దలంటే ఎంతో గౌరవం ఉన్న నటుడు అని ఆమె మెచ్చుకున్నారు.

ఇన్నేళ్లు నటించినా, ఇప్పటికీ తెరపై తనను తాను చూసుకునేటప్పుడు 'కొత్త నటి'లాగే టెన్షన్ పడతానని ఆమె ఓపెన్‌గా ఒప్పుకున్నారు. తన చీరకట్టు, హెయిర్ స్టైల్ ఎలా ఉందో అని కంగారు పడతానన్నారు. అలాగే, కె. బాలచందర్ గారి ‘సుజాత’ సినిమా తన మనసుకు బాగా దగ్గరైన ఎమోషనల్ మూవీ అని, ఇప్పటికీ ఆ సినిమా పాట వింటే కళ్లలో నీళ్లు తిరుగుతాయని చెప్పారు.

44
ఉదయం 5 గంటలకు వచ్చిన ఎన్టీఆర్ ఫోన్ కాల్

తన రాజకీయ ప్రవేశం గురించి జయప్రద చెబుతూ.. "సీనియర్ ఎన్టీఆర్ గారే నా రాజకీయ ప్రవేశానికి స్ఫూర్తి. ఆయన అధికారం కోల్పోయి కష్టకాలంలో ఉన్నప్పుడు, నేను బెంగళూరులో షూటింగ్‌లో ఉన్నాను. అప్పుడు ఉదయం 5 గంటలకు ఆయన ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. సాయంత్రం ఆయన్ని కలవడానికి వెళ్లినప్పుడు, త్వరగా పడుకునే అలవాటు ఉన్న ఎన్టీఆర్ గారు నా కోసం నిద్రలేచి వచ్చి మాట్లాడారు. ఆయన పిలుపుతోనే నేను తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరాను" అని వివరించారు.

"మీరు రాజకీయాల్లోకి వెళితే సినిమా అవకాశాలు పోతాయని నిర్మాతలు నన్ను భయపెట్టారు. కానీ, ఎన్టీఆర్ గారికి మాట ఇచ్చినందువల్ల నేను ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడి ఆయన వెంటే నిలబడ్డాను. ఎన్టీఆర్ గారి చైతన్య రథం బస్సు యాత్ర, అలాగే ప్రజలకు ₹2 కే కిలో బియ్యం ఇచ్చే పథకాలు నాపై చాలా ప్రభావం చూపించాయి. ఆ స్ఫూర్తితోనే నేను ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఎలాంటి సపోర్ట్ లేకుండా ఒంటరిగా పోరాడి ఎంపీగా గెలిచాను. నా ఆత్మకథలో ఇది చాలా ముఖ్యమైన అధ్యాయం అవుతుంది" అని జయప్రద గర్వంగా చెప్పారు.

Read more Photos on
click me!

Recommended Stories