50 ఏళ్ళ వయసులో అమెరికన్లకు షాకిచ్చిన హృతిక్ రోషన్, ఎవరు అతడు అంటూ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు

Published : Apr 07, 2025, 05:56 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ అమెరికా ఇంటర్నెట్ లో పెద్ద దుమారంగా మారారు. 50 ఏళ్ళ వయసులో హృతిక్ రోషన్ యంగ్ లుక్ కి అమెరికా జనాలు ఫిదా అవుతున్నారు. దీంతో అమెరికా ఇంటర్నెట్, గూగుల్ లో హృతిక్ ట్రెండింగ్ లో టాప్ పొజిషన్ లో ఉన్నారు. అసలు అమెరికాలో హృతిక్ గురించి చర్చ ఎందుకు మొదలైందో ఇప్పుడు చూద్దాం.   

PREV
16
50 ఏళ్ళ వయసులో అమెరికన్లకు షాకిచ్చిన హృతిక్ రోషన్, ఎవరు అతడు అంటూ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు
hrithik roshan

హృతిక్ రోషన్ క్రిష్ లాంటి చిత్రాలతో ఇండియన్ సినిమాలో సూపర్ హీరో అయ్యాడు. అభిమానులు హృతిక్ ని ముద్దుగా బాలీవుడ్ గ్రీక్ గాడ్ అని పిలుస్తుంటారు. మహిళల్లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో హృతిక్ రోషన్ ఒకరు. ప్రస్తుత హృతిక్ రోషన్, ఎన్టీఆర్ తో కలసి వార్ 2లో నటిస్తున్నారు. క్రిష్, ధూమ్ 2 లాంటి చిత్రాలు హృతిక్ కి సౌత్ లో కూడా ఫాలోయింగ్ పెంచాయి. 

26

తాజాగా హృతిక్ రోషన్ ఊహించని విధంగా అమెరికాలో ట్రెండింగ్ గా మారారు. అమెరికన్లు ఎవరీ మిస్టరీ మాన్ అంటూ గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. దీనితో హృతిక్ రోషన్ అమెరికా గూగుల్ లో ట్రెండింగ్ లో టాప్ లో ఉన్నారు. ఇంతకీ ఎందుకు ఇలా జరిగిందో చూద్దాం. ఒక అమెరికన్ యూజర్ ట్విట్టర్ లో కంపారిజన్ పోస్ట్ చేశారు. ది లిజ్ వేరియంట్ అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ పోస్ట్ వచ్చింది. ఇందులో 50 ఏళ్ళ వయసులో బాగా వృద్ధుడిగా కనిపిస్తున్న అమెరికా వ్యక్తిని, అదే వయసులో యంగ్ గా, ఫిట్ గా ఉన్న హృతిక్ రోషన్ ని పోల్చుతూ పోస్ట్ చేశారు. 

36

1985లో 50 ఏళ్ళ వయసులో ఇలా ఉండేవారు అంటూ అమెరికన్ ని, 2025 లో 50 ఏళ్ళ వయసులో ఇలా ఉన్నారు అంటూ హృతిక్ రోషన్ ని పోల్చారు. ఈ పోస్ట్ కి ఇది ఫన్నీగా ఉంది ఎందుకంటే ఇది నిజం. అది కష్టం అని మీరు ఎందుకు అనుకుంటున్నారు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్ట్ యుఎస్ ఇంటర్నెట్ ని బ్రేక్ చేసేలా వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ ని ఆల్రెడీ 10.5 మిలియన్ల మంది నెటిజన్లు చూశారు. దాదాపు 79 వేల లైక్స్ వచ్చాయి. 

 

46

50 ఏళ్ళ వయసులో ఇంత యంగ్ గా కనిపిస్తున్న ఆ వ్యక్తి ఎవరు అంటూ యుఎస్ నెటిజన్లు గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. కుడివైపున ఉన్న వ్యక్తి ఎవరు అని నెటిజన్లు అడుగుతుండడంతో తెలిసిన వారు కామెంట్స్ చేస్తున్నారు. అతడు హృతిక్ రోషన్, బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. 

 

56
Hrithik Roshan

మరో అభిమాని కామెంట్ చేస్తూ.. హృతిక్ రోషన్ పేరు ఇప్పుడు గ్లోబల్ స్థాయికి వెళ్ళింది. అతడు ఏషియన్.. రోషన్ బాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ సక్సెస్ ఫుల్ హీరో అని పేర్కొన్నాడు. మరికొందరు నెటిజన్లు ఈ కంపారిజన్ ని తప్పు పడుతున్నారు. ఒక కామన్ మాన్ ని సినిమా హీరోతో పోల్చడం సరికాదు అని అంటున్నారు. 

66
Hrithik Roshan

హృతిక్ రోషన్ ఫిట్ నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. గంటల తరబడి జిమ్ లో గడుపుతారు. అందుకే ఈ వయసులో కూడా హృతిక్ సిక్స్ ప్యాక్ లుక్ తో అదరగొడుతున్నారు. ఇదిలా ఉండగా హృతిక్ రోషన్ త్వరలో దర్శకుడిగా కూడా మారబోతున్నారు. క్రిష్ 4 చిత్రం హృతిక్ దర్శకత్వంలో రూపొందనుంది. 

Read more Photos on
click me!

Recommended Stories