మొత్తం భార్య పిల్లలకే వదిలేశా, నా దగ్గర ఏమీ లేదు.. ఆర్తి ఆరోపణలపై జయం రవి రియాక్షన్

First Published | Sep 23, 2024, 9:28 PM IST

పొన్నియన్ సెల్వం, టిక్ టిక్ టిక్ లాంటి చిత్రాల్లో నటించిన జయం రవి ఇటీవల తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీనితో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. 

పొన్నియన్ సెల్వం, టిక్ టిక్ టిక్ లాంటి చిత్రాల్లో నటించిన జయం రవి ఇటీవల తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీనితో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. జయం రవి, ఆర్తి మధ్య విడాకులకు కారణాలు ఎవ్వరికీ తెలియదు.. భార్యతో విభేదాలు ఎందుకు వచ్చాయి అనే అంశాలపై సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. 

జయం రవి మరో అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడని ఒక రూమర్ ప్రచారంలో ఉంది. ఆర్తి తల్లి, జయం రవి అత్తగారు అతడిని చులకనగా చూస్తున్నారు అనే రూమర్స్ కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా జయం రవి అసలు విడాకుల విషయాన్ని తనకు చెప్పలేదని, తనతో చర్చించలేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాడని ఆరోపించింది. 


ఆర్తి మరో ఆరోపణ కూడా చేసింది. తనకి పిల్లలకు ఎలాంటి ఆర్థిక సహకారం లేకుండా ఒంటరిగా వదిలేశాడని ఆరోపించింది. దీనితో జయం రవి స్పందించారు. ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేదు. మొత్తం పిల్లలు, ఆర్తి కోసం వదిలేసి నేను ఖాళీ చేతులతో బయటకి వచ్చేశా అని జయం రవి సమాధానం ఇచ్చారు. 

అదే విధంగా సింగర్ కెనిషాతో రిలేషన్ లో ఉన్నాడంటూ వస్తున్న రూమర్స్ పై జయం రవి స్పందించారు. మా విడాకుల విషయంలోకి మూడో వ్యక్తిని లాగొద్దు. కెనీషా కష్టపడి ఎదిగిన అమ్మాయి. సింగర్ గా రాణిస్తూనే సైకాలజిస్ట్ గా కూడా సేవలు అందిస్తోంది. ఆమెతో కలసి ఆధ్యాతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నా. అంతకు మించి ఇంకేమి లేదు. మా మధ్య ఏదో ఉన్నట్లు వస్తున్న రూమర్స్ పూర్తిగా అవాస్తవం అని జయం రవి అన్నారు. 

Latest Videos

click me!