తెలంగాణలో 'దేవర' మిడ్ నైట్ షోలకు అనుమతి.. మొత్తం 29 స్క్రీన్ లలో, కంప్లీట్ డీటెయిల్స్

First Published | Sep 23, 2024, 8:55 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం దేవర ఫీవర్ తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. దేవర చిత్రానికి భారీ ఓపెనింగ్స్ నమోదయ్యేలా అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇక సినిమాకి బజ్ ఏ స్థాయిలో ఉంది అనే దాన్నిబట్టి తొలిరోజు రికార్డులు ఉంటాయి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం దేవర ఫీవర్ తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. దేవర చిత్రానికి భారీ ఓపెనింగ్స్ నమోదయ్యేలా అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇక సినిమాకి బజ్ ఏ స్థాయిలో ఉంది అనే దాన్నిబట్టి తొలిరోజు రికార్డులు ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవర చిత్రానికి అదనపు షోలు, టికెట్ ధరల పెంపు, మిడ్ నైట్ షోలకు అనుమతి లభించింది. 

ఆల్రెడీ దేవర చిత్రానికి వెసులుబాటు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా జీవో విడుదల అయింది. హైదరాబాద్ లో ప్రదర్శించే మిడ్ నైట్ షోల విషయంలో తాజా జీవోతో క్లారిటీ వచ్చేసింది. మొత్తం నైజాం ఏరియాలో 29 స్క్రీన్ లలో మిడ్ నైట్ షోలు అంటే 27 వ తేదీ తెల్లవారు జామున 1 గంటకు ప్రదర్శించుకునేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 


కేవలం హైదరాబాద్ లోనే 21 స్క్రీన్ లలో 1 గంట షోలు ప్రదర్శించుకునేందుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఖమ్మంలో 5  స్క్రీన్ లలో, మహబూబ్ నగర్, మిర్యాల గూడా, గద్వాల్  ఒక్కో స్క్రీన్ చొప్పున మిడ్ నైట్ షోలు ప్రదర్శించుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో 21 స్క్రీన్ లలో అనుమతి ఇచ్చారు. వీటిలో ఏఎంబి సినిమాస్, పివిఆర్, ప్రసాద్స్ లాంటి ప్రధాన మల్టిఫ్లెక్స్ లు ఉన్నాయి. 

తెలంగాణలో  కేవలం 27వ తేదీన మొత్తం 6 షోలు ప్రదర్శించుకునేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 28 వ తేదీ నుంచి 6 వ తేదీ వరకు రోజుకు 5 షోలు ప్రదర్శించుకోవచ్చు. ఈ రోజుల్లో మల్టిప్లెక్స్ లలో 50 రూపాయలు, సింగిల్ స్క్రీన్ లలో 25 రూపాయలు పెంచుకునేలా ప్రభుత్వం అనుమతి ఇవ్వడం విశేషం. 

Latest Videos

click me!