దేవలోకపు అప్సరసలా సదా హోయలు.. గోల్డ్ కలర్‌ డ్రెస్ లో `జయం` బ్యూటీ అందం ఓవర్‌లోడ్‌

Published : Mar 10, 2024, 04:48 PM IST

`జయం` బ్యూటీ సదా ఇటీవల రీఎంట్రీ ఇచ్చింది. బుల్లితెరపై మెప్పిస్తుంది. కీలక పాత్రల్లో నటిస్తూ అదరగొడుతుంది. ఓ వైపు టీవీ, మరోవైపు సినిమాలు చేస్తూ బ్యాలెన్స్ చేస్తుంది.   

PREV
19
దేవలోకపు అప్సరసలా సదా హోయలు.. గోల్డ్ కలర్‌ డ్రెస్ లో `జయం` బ్యూటీ అందం ఓవర్‌లోడ్‌

సదా కెరీర్‌ ప్రారంభించి రెండు దశాబ్దాలు పూర్తయినా ఇప్పటికీ `జయం` హీరోయిన్‌గానే పిలుస్తుంటారు ఈ భామని. అంతగా తెలుగు ఆడియెన్స్ లో ముద్ర వేసుకుంది సదా. తనదైన నటనతో మెప్పించింది. 
 

29

పల్లెటూరి పిల్లలా, లెహంగా ఓణిలో మెరిసింది. తెలుగు ఆడియెన్స్ ని మెస్మరైజ్‌ చేసింది. దీంతోపాటు `ఔనన్నా కాదన్నా` సినిమాలోనూ అలాంటి పాత్రలోనే మెరిసింది. అచ్చ తెలుగు పడుచు పిల్లలా మెరిసింది. తనదైన అందంతో మెప్పించింది. 
 

39

తెలుగులో చాలా సినిమాలు చేసింది. కానీ ఈ సినిమాలతోనే ఎక్కువగా గుర్తిండిపోతుంది. ఆడియెన్స్ ని అలరిస్తుంది. ట్రెడిషనల్‌ లుక్‌లో మొదట్లో మెరిసిన సదా ఆ తర్వాత రూట్‌ మార్చింది. తాను కూడా కమర్షియల్‌ హీరోయినే అని నిరూపించుకుంది. 
 

49

శంకర్ దర్శకత్వంలో `అపరిచితుడు` చిత్రంలో విక్రమ్‌కి జోడీగా నటించింది. ప్రారంభంలో ఆమె ట్రెడిషనల్‌గానే కనిపించింది. కానీ రొమియో పాత్ర ఎంట్రీతో ఆమె సైతం రొమాంటిక్‌గా మారింది. అందాల విందు చేస్తూ మతిపోగొట్టింది. 

59

ఇలా తనపై ఉన్న హోమ్లీ బ్యూటీ అనే ముద్రని తీసేసింది. ఆ తర్వాత చాలా వరకు గ్లామర్‌ రోల్స్ చేసింది సదా. అలా ఎన్ని చేసినా ఆమెకి ఆర్టిఫిషియల్‌గానే ఉన్నాయి తప్ప, సహజంగా సెట్‌ కాలేదు. లెహంగా వోణీనే యాప్ట్ గా అనిపించింది. 
 

69

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ సినిమాలు చేసి మెప్పించింది. దాదాపు పదేళ్ల పాటు ఆమె కెరీర్‌ ఫుల్‌ స్వింగ్‌లో సాగింది. కానీ ఆ తర్వాత స్లో అయ్యింది. ఆఫర్లు తగ్గాయి. కొత్త హీరోయిన్ల జోరులో ఈ బ్యూటీ క్రేజ్‌ పడిపోయింది. 
 

79

దీంతో క్రమంగా ఫేడౌట్‌ అయిపోయింది. దీన్ని గమనించి సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది సదా. ఆమె వ్యక్తిగత జీవితంపై ఫోకస్‌ పెట్టింది. పెళ్లి చేసుకోలేదు, ఇప్పటికీ సింగిల్‌గానే ఉంది. అదే సమయంలో జంతు ప్రేమికురాలిగా వైల్డ్ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. 
 

89

ఈ నేపథ్యంలో ఇటీవల రీఎంట్రీ ఇచ్చింది. టీవీ షోస్‌లో మెరుస్తుంది. జబర్దస్త్, కామెడీ స్టార్స్, ఆదివారం స్టార్‌ మా పరివార్‌, డాన్సు షో వంటి షోస్‌కి జడ్జ్ గా చేస్తుంది. అలాగే సినిమాల్లోనూ మెరుస్తుంది. ఇటీవల ఆమె `అహింస`, `ఆదికేశవ` మూవీస్‌లో నటించింది. కానీ రెండు డిజప్పాయింట్‌ చేస్తుంది. 
 

99

సెకండ్‌ ఇన్నింగ్స్ లో మాత్రం గ్లామర్‌ షోతో దుమ్మురేపుతుంది. అందాల విందులో నెక్ట్స్ లెవల్‌ చూపిస్తుంది. తాజాగా గోల్డెన్‌ కలర్ డ్రెస్‌లో హోయలు పోయింది. దేవలోకం నుంచి దిగి వచ్చిన అప్సరసలా మెరిసిపోతుంది. సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories