ఓటీటీలో `బ్రీత్‌` మూవీ.. నందమూరి చైతన్య కృష్ణని ఇంత దారుణంగా ర్యాంగింగ్‌ చేస్తారా?..

Published : Mar 10, 2024, 04:08 PM IST

నందమూరి చైతన్య కృష్ణ హీరోగా `బ్రీత్‌` సినిమా రూపొంది గతేడాది డిసెంబర్‌లో విడుదలైంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంది. దీనిపై దారుణంగా ట్రోల్‌ నడుస్తుంది.   

PREV
16
ఓటీటీలో `బ్రీత్‌` మూవీ.. నందమూరి చైతన్య కృష్ణని ఇంత దారుణంగా ర్యాంగింగ్‌ చేస్తారా?..

నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో నందమూరి చైతన్య కృష్ణ. ఆయన గతంలో ఓ మూవీ చేసి కనుమరుగయ్యారు. గతేడాది మళ్లీ రీఎంట్రీ ఇస్తూ `బ్రీత్‌` సినిమాలో నటించాడు. యంట్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించారు. మెడికల్‌ మాఫియా నేపథ్యంలో రూపొందిన ఈ మూవీని తన సొంత బ్యానర్‌పై చైతన్య కృష్ణ నిర్మించారు. 
 

26

గతేడాది విడుదలైన ఈ మూవీ థియేటర్లో ఆడలేదు. `బ్రీత్‌` సినిమాని కనీసం నందమూరి అభిమానులు కూడా చూడలేదు. అసలు ఇదొక మూవీ విడుదలవుతుందనే విషయం కూడా జనాలకు తెలియదు. అంతేకాదు థియేటర్లో జీరో షేర్‌ నమోదు చేసింది. దీంతో అప్పట్లోనే ఈ మూవీపై దారుణంగా ట్రోల్‌ జరిగింది. ఆడియెన్స్ సోషల్‌ మీడియా వేదికగా ఆడుకున్నారు. 
 

36

ఇటీవల మహాశివరాత్రి సందర్భంగా ఓటీటీలోకి వచ్చింది. ఆహాలో దీన్ని విడుదల చేశారు. ఇప్పుడు సోషల్‌ మీడియాలో మరోసారి దీనిపై చర్చ నడుస్తుంది. ఇక ఇందులో సీన్‌ టూ సీన్‌ తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు నెటిజన్లు. ఇందులో చైతన్య కృష్ణ నటన గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన ఎంత అద్భుతంగా చేశాడో చూడండి అంటూ క్లిప్పులను పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు అవి వైరల్‌ అవుతున్నాయి. 
 

46

ఇక కొందరు రివ్యూ చెబుతున్నారు. ఫస్ట్ ఆఫ్‌ ఎక్స్ లెంట్‌ అని, సెకండాఫ్‌ తెలుగు సినిమాలో ఇలాంటి సీన్‌ చూడలేదని, ఈ జనరేషన్‌లో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్‌ మూవీ అంటూ కితాబిస్తున్నారు. ప్రతి నిమిషం, ప్రతి సెకన్‌ సస్పెన్స్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుందని, అంతేకాదు ఏకంగా 5కి రేటింగ్‌ 4.9 ఇస్తుండటం విశేషం. 

56

 చైతన్య కృష్ణ యాక్టింగ్‌ అమేజింగ్‌ అని, అది చూస్తే తట్టుకోవడం కష్టమే అంటూ ర్యాంగింగ్‌ చేస్తున్నారు. ఇక చైతన్య కృష్ణ వాక్‌ చేసే ఓ సీన్‌ని పోస్ట్ చేస్తూ స్టూడెంట్‌గా ఆయన లుక్‌ మైండ్‌ బ్లోయింగ్‌ అని, వాకింగ్‌ స్టయిల్‌, గ్రేస్‌ చూస్తే మతిపోవాల్సిందే అంటున్నారు. మరికొందరు మాత్రం `బ్రీత్‌` సినిమా చూశాక బతికుంటే కలుద్దామని, చచ్చి బతికినట్టు ఉందని రవితేజ సినిమాల్లోని క్లిప్పులు వాడుతూ ట్రోల్‌ చేస్తున్నారు. 

66

ఇందులో `బ్రీత్‌` సినిమా గురించి చెబుతూ, బ్రీత్‌ అంటే ఏంటో అనుకున్నా మన బ్రీత్‌ ఆగిపోతుందని చూశాక అర్థమైందంటున్నారు. మెంటల్‌ మాస్‌ రేంజ్‌ సీన్లు ఉన్నాయని ఇదొక లైఫ్‌ టైమ్‌ ఎక్స్ పీరియెన్స్ అంటూ నానా రచ్చ చేస్తున్నారు నందమూరి అభిమానులు. ఇక నెటిజన్లు మాత్రం మరో స్థాయిలో ర్యాగింగ్‌ చేస్తున్నారు. దీంతో ఇది నెట్టింట రచ్చ లేపుతుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories