తెలుగు అమ్మాయి శోభిత అప్పుడే అన్ని కోట్లు కూడబెట్టిందా?

First Published May 25, 2024, 8:34 PM IST

శోభిత ధూళిపాళ్ల తక్కువ సమయంలో బాగానే కూడబెట్టారట. ఆమె సంపాదన ఎన్ని కోట్ల రూపాయలో ఒక నివేదిక తెలియజేసింది. 
 

Sobhita Dhulipala

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలిలో పుట్టిన శోభిత దూళిపాళ్ల మోడలింగ్ కెరీర్ గా ఎంచుకుంది. 2016లో రామన్ రాఘవన్ 2.0 చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. ఆ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 

గూఢచారి చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. అడివి శేష్ హీరోగా తెరకెక్కిన స్పై థ్రిల్లర్ హిట్ కొట్టింది. శోభిత దూళిపాళ్లకు కొంత ఫేమ్ తెచ్చిపెట్టింది ఈ చిత్రం. ది బాడీ, ఘోస్ట్ స్టోరీస్ ఇలా బాలీవుడ్ లో ఎక్కువగా నటిస్తూ వచ్చింది. 

అడివి శేష్ ఆమెకు మరోసారి ఆఫర్ ఇచ్చాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించిన మేజర్ మూవీలో శోభిత దూళిపాళ్ల నటించింది. మేజర్ సైతం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. 

అనూహ్యంగా మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వమ్ మూవీలో శోభిత ధూళిపాళ్లకు కీలక రోల్ దక్కింది. పొన్నియిన్ సెల్వన్, పొన్నియిన్ సెల్వన్ 2 చిత్రాల్లో శోభిత దూళిపాళ్ల నటించింది. 

హాలీవుడ్ లో కూడా శోభిత అడుగుపెట్టింది. మంకీ మ్యాన్ టైటిల్ తో విడుదలైన చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ చిత్రంలో ఆమె వేశ్య పాత్ర చేయడం విశేషం.మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్ వంటి సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్లలో నటించింది. 

Sobhita dhulipala

కాగా శోభిత మోడల్ గా నటిగా బాగానే సంపాదించారని సమాచారం. బాలీవుడ్ షాదీస్ నివేదిక ప్రకారం శోభిత సంపాదన విలువలు రూ. 7 నుండి 10 కోట్లు ఉంటుందట. అలాగే శోభిత ఒక్కో సినిమాకు రూ. 70 లక్షల నుండి రూ. 1 కోటి తీసుకుంటున్నారట. 

click me!