చీరకట్టులో చిట్టి ఇంత అందంగానా.. కుర్రాళ్ల గుండెజారి గల్లంతే.. పర్పుల్ శారీలో మెరిసిపోతున్న ఫరియా అబ్దుల్లా..

Published : Jul 05, 2022, 03:09 PM ISTUpdated : Jul 05, 2022, 03:12 PM IST

‘జాతిరత్నాలు’తో  తెలుగు ప్రేక్షకులుగా హీరోయిన్ గా పరిచయం అయ్యింది నటి ఫరియా అబ్దుల్లా . తొలి మూవీతోనే కుర్రకారును ఆకట్టుకుంది. ఇటు నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజాగా ఫరియా చీరకట్టులో మెస్మరైజ్ చేస్తోంది.  

PREV
16
చీరకట్టులో చిట్టి ఇంత అందంగానా.. కుర్రాళ్ల గుండెజారి గల్లంతే.. పర్పుల్ శారీలో మెరిసిపోతున్న ఫరియా అబ్దుల్లా..

టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పొలిశెట్టి (Naveen Polisetty), హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) జంటగా నటించిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ ‘జాతి రత్నాలు’. ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వం వహించారు. 
 

26

గతేడాది రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అలాగే మూవీలోని ఫరియా అబ్దుల్లా నటించిన ‘చిట్టి’ పాత్ర కూడా ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. తొలి సినిమాతోనే టాలీవుడ్ యాక్ట్రెస్ గా ముద్రవేసుకుంది ఫరియా. తన అందం, అభినయంతో కుర్రాళ్ల గుండెల్ని దోచుకుంది.
 

36

ఫరియా ఎత్తు, అందం, అభినయంలో స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు. మరోవైపు డాన్స్ కూడా అద్భుతంగా చేయగలదు. ఎప్పుడూ తన అభిమానులు, ఫాలోవర్స్ ను సోషల్ మీడియా వేదికన పలకరిస్తూనే ఉంటుంది. ఇందు కోసం లేటెస్ట్ డాన్స్ రీల్స్.. పలు వీడియోలు.. ఫొటోషూట్లతో ఆకట్టుకుంటుంది.
 

46

తాజాగా ఫరియా చీరకట్టులో దర్శనమిచ్చింది. చాలా అరుదుగా ఫరియా ఫొటోషూట్లు చేస్తుంటుంది. అందులోనూ లేటెస్ట్ గా సంప్రదాయ దుస్దుల్లో అచ్చమైన తెలుగమ్మాయిలా కనువిందు చేస్తోంది. పర్పుల్ శారీలో ఫరియా మరింత మెరిసిపోతోంది. అదిరిపోయే ఫోజులతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది.
 

56

అయితే సింగానియాస్ క్లాథింగ్ బ్రాండ్ మరియు శ్రీ ఎక్సోటిక్ సిల్వర్ జూయెల్లరీ కోసం ఫరియా ఈ ఫొటోషూట్ చేసింది. పట్టుచీర కట్టుకొని, మ్యాజింగ్ జూయెల్లరీని ధరించడంతో ఫరియా అందం రెండింతలైంది. ప్రస్తుతం ఈ పిక్స్ ను ఆమె అభిమానులు తెగ లైక్ చేస్తూ.. కామెంట్లు చేస్తూ వైరల్ చేస్తున్నారు.

66

ఇక Jathiratnalu తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫరియా.. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘రావణాసుర’లో అవకాశం దక్కించుకుంది. అలాగే యంగ్ హీరో సంతోష్ శోభన్ తో ఓ సినిమా కమిట్ అయ్యింది.  అదేవిధంగా తమిళ చిత్రం ‘వల్లీ మయిల్’లో విజయ్ ఆంటోనీతో కలిసి నటిస్తోంది.

click me!

Recommended Stories