Actor Chinna
సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ అతిపెద్ద హీరో. ఆయనకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. మహేష్ బాబు సక్సెస్ రేటు ఎక్కువే. శ్రీమంతుడు చిత్రం తర్వాత మహేష్ బాబు నటించిన ప్రతి సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. నిర్మాతలకు లాభాలు పంచింది. లేటెస్ట్ మూవీ గుంటూరు కారం సైతం మిక్స్డ్ టాక్ తో కూడా చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన గుంటూరు కారం రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. మీనాక్షి చౌదరి మరొక హీరోయిన్. సంక్రాంతి కానుకగా గుంటూరు కారం విడుదలైన సంగతి తెలిసిందే.
కాగా మహేష్ బాబు స్క్రిప్ట్ సెలక్షన్ గొప్పగా ఉందని చెప్పొచ్చు. అయితే మహేష్ బాబు రిజెక్ట్ చేసిన చిత్రాలు చేసిన అల్లు అర్జున్ స్టార్ అయ్యారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఇమేజ్ ని ఎల్లలు దాటించిన మూడు చిత్రాలు మహేష్ చేయాల్సింది. ఆయన రిజెక్ట్ చేయడంతో అల్లు అర్జున్ వద్దకు వచ్చాయి. ఆ చిత్రాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
Mahesh Babu
పుష్ప కథను దర్శకుడు సుకుమార్ మహేష్ బాబును దృష్టిలో ఉంచుకుని రాశాడు. సరిలేరు నీకెవ్వరు అనంతరం మహేష్ బాబు చేయాల్సిన మూవీ ఇదే. నెగిటివ్ షేడ్స్ తో కూడిన డీ గ్లామర్ రోల్ చేసేందుకు మహేష్ బాబు వెనుకాడారు. పుష్ప కథను మొదట మహేష్ బాబుకు సుకుమార్ నెరేట్ చేశాడట. కానీ ఆయన చేయను అన్నాడట. దాంతో పుష్ప కథను అల్లు అర్జున్ కి చెప్పాడు. ఆయన ఓకే చెప్పడంతో అల్లు అర్జున్ ఇమేజ్ కి తగ్గట్లు మార్పులు చేసి స్క్రిప్ట్ సిద్ధం చేశాడు.
2021లో విడుదలైన పుష్ప ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. వరల్డ్ వైడ్ రూ. 360 కోట్ల వసూళ్లు రాబట్టింది. వసూళ్ల సంగతి అటుంచితే అల్లు అర్జున్ కి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిపెట్టింది. నార్త్ లో అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పుష్ప కి కొనసాగింపుగా వస్తున్న పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి . పుష్ప 2 డిసెంబర్ 6న విడుదలవుతున్న సంగతి తెలిసిందే..
అల్లు అర్జున్ కెరీర్లో సెకండ్ బిగ్గెస్ట్ హిట్ అల వైకుంఠపురములో. 2020 సంక్రాంతి కానుకగా విడుదలైన అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ కథను ముందుగా మహేష్ బాబుకు నెరేట్ చేశాడట త్రివిక్రమ్. కథ నచ్చినప్పటికీ మహేష్ బాబుకు ఉన్న కమిట్మెంట్స్ రీత్యా అల వైకుంఠపురములో చేయడం కుదరలేదట.ఆ విధంగా అల వైకుంఠపురంలో మహేష్ బాబు చేయి జారింది.
దాంతో తన ఫేవరేట్ హీరో అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ అల వైకుంఠపురములో చిత్రం తెరకెక్కించాడు. అల వైకుంఠపురములో అనేక రికార్డ్స్ తిరగరాసింది. అల వైకుంఠపురంలో చిత్రానికి పోటీగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు సైతం భారీ విజయం అందుకుంది. అయితే సంక్రాంతి విన్నర్ మాత్రం అల వైకుంఠపురములో అని చెప్పాలి
మహేష్ రిజెక్ట్ చేసిన మరొక చిత్రం రుద్రమదేవి. ఈ మూవీలో అనుష్క శెట్టి ప్రధాన పాత్ర చేసింది. అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి అనే ఓ పవర్ఫుల్ రోల్ చేశాడు. రుద్రమదేవి దర్శకుడు గుణశేఖర్ మహేష్ కి అత్యంత ఆప్తుడు. వీరి కాంబోలో ఒక్కడు, అర్జున్, సైనికుడు తెరకెక్కాయి. కారణం తెలియదు కానీ... మహేష్ బాబు గోన గన్నారెడ్డి రోల్ చేయను అన్నాడట. రుద్రమదేవి చిత్రంలో గోన గన్నారెడ్డి పాత్ర నిడివి తక్కువే కానీ అల్లు అర్జున్ కి మంచి పేరు తెచ్చింది...
రుద్రమదేవి, అల వైకుంఠపురములో, పుష్ప చిత్రాలు అల్లు అర్జున్ ఇమేజ్ ఎల్లలు దాటించాయి. ఈ మూడు చిత్రాలు రిజెక్ట్ చేసిన మహేష్ బాబు పరోక్షంగా అల్లు అర్జున్ ఎదుగుదలకు కారణం అయ్యాడు. అయితే ఆ చిత్రాలు మహేష్ చేస్తే హిట్ అవుతాయి అని చెప్పలేం. మహేష్ అనేక విషయాలు పరిశీలించే రిజెక్ట్ చేసి ఉంటారు.
ఇక మహేష్ ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29కి సిద్ధం అవుతున్నాడు. ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. మహేష్ బాబును రాజమౌళి సరికొత్తగా ప్రెజెంట్ చేయనున్నాడు. ఈ మూవీ కోసం మహేష్ బాబు జుట్టు, గడ్డం పెంచాడు. దాదాపు రూ. 800 కోట్లతో మూవీ రూపొందించనున్నారు.