నేను భరించలేను అని ఛార్మి చెప్పింది..పూరి జగన్నాధ్ 'డబుల్ ఇస్మార్ట్' పై జానీ మాస్టర్ ఊహించని కామెంట్స్

Published : Jul 21, 2024, 01:26 PM IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ చిత్రం ఆగష్టు 15న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీ తప్పనిసరిగా హిట్ కావడం పూరి జగన్నాధ్ కి చాలా అవసరం.

PREV
17
నేను భరించలేను అని ఛార్మి చెప్పింది..పూరి జగన్నాధ్ 'డబుల్ ఇస్మార్ట్' పై జానీ మాస్టర్ ఊహించని కామెంట్స్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ చిత్రం ఆగష్టు 15న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీ తప్పనిసరిగా హిట్ కావడం పూరి జగన్నాధ్ కి చాలా అవసరం. ఎందుకంటే గత చిత్రం లైగర్ మిగిల్చిన నష్టాలు అంతా ఇంతా కాదు. మరోవైపు రామ్ పోతినేని కూడా ఫ్లాపుల్లో ఉన్నాడు. 

27
Double iSmart

దీనితో డబుల్ ఇస్మార్ట్ పై అందరి చూపు పడింది. ఇటీవల ఈ చిత్ర సాంగ్ రిలీజ్ చేయగా అందులో పూరి జగన్నాద్ మాజీ సీఎం కేసీఆర్ వాయిస్ ఉపయోగించారు. కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడిన 'ఏం చేద్దాం అంటావ్ మరి' అని మాటని ఉపయోగించారు. అది కాస్త వివాదం అయింది. 

37

ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. సినిమా నిర్మాణంలో విషయంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. పాటల చిత్రీకరణలో తెలుగు సినిమాలకు ఎక్కువ మంది తెలుగు డ్యాన్సర్లనే పెట్టుకోవాలి. కానీ డబుల్ ఇస్మార్ట్ చిత్రంలో ఎక్కువగా ముంబై డ్యాన్సర్లనే ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. 

47

ఈ చిత్రానికి జానీ మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్. ఆయన ఈ వివాదంపై వివరణ ఇచ్చారు. పూరి జగన్నాధ్ గారు డబుల్ ఇస్మార్ట్ చిత్రంలోని ఒక సాంగ్ కి దాదాపు 200 మంది డ్యాన్సర్లు అవసరం అవుతారు అని చెప్పారు. డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. పూరి జగన్నాధ్ గారు 200 మంది కావాలని అంటున్నారని ఛార్మికి చెప్పా. 

57

ఆమె 200 మంది అయితే కష్టం.. 110 మంది అయితే ఒకే అని ఫైనల్ చేశారు. ఇప్పుడు 110 మంది డ్యాన్సర్లు కావాలి. మేడం టాలీవుడ్ డ్యాన్సర్ల యూనియన్ లో  రూల్ ఉంది.. ఎక్కువ మంది డ్యాన్సర్లని తెలుగు వాళ్ళని పెట్టుకోవాలి. హైదరాబాద్ యూనియన్ నుంచి రప్పించాలి అని చెప్పా. అప్పుడు ఆమె ఒకే మాట అన్నారు. జానీ.. నేను ఇప్పుడు నష్టాల్లో ఉన్నా. అంత మందిని హైదరాబాద్ నుంచి తీసుకురావాలంటే ఖర్చులు నేను భరించలేను. 

67

హైదరాబాద్ లో షూటింగ్ చేసినప్పుడు ఎక్కువ మందిని అక్కడి నుంచే తీసుకున్నాం కదా. ఇప్పుడు షూటింగ్ ముంబైలో జరుగుతోంది. వాళ్ళ ట్రావెల్, ఫుడ్ ఖర్చులు నేను భరించలేను.. కష్టాల్లో ఉన్నాను అని చెప్పారు. సరే అని కనీసం 20 మందిని అయినా తెచ్చుకుందాం అని చెప్పా. దానికి ఛార్మి ఒకే అన్నారు. 

77

అప్పుడు డ్యాన్సర్ల కోసం నేను యూనియన్ కి ఫోన్ చేస్తే ఎవరూ స్పందించలేదు. ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు.  ఆ సమయంలో యూనియన్ ఎన్నికలు జరుగుతున్నట్లు జానీ మాస్టర్ తెలిపారు. షూటింగ్ సమయం అయిపోతుండడంతో ముంబై వాళ్లనే పెట్టుకోవాల్సి వచ్చింది అని క్లారిటీ ఇచ్చారు. 

click me!

Recommended Stories