వయసు కారణంగా ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్న టబు.. ఇకపై ఈ స్టార్ లేడీ సిల్వర్ స్క్రీన్ పై అలా!

Published : Jul 21, 2024, 01:19 PM IST

50 ప్లస్ లో ఉన్న టబు ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆమె సిల్వర్ స్క్రీన్ పై అలాంటి పాత్రల్లో కనిపించదట. ఆమె కామెంట్స్ పరిశ్రమలో చర్చకు దారి తీశాయి.   

PREV
16
వయసు కారణంగా ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్న టబు.. ఇకపై ఈ స్టార్ లేడీ సిల్వర్ స్క్రీన్ పై అలా!
Heroine Tabu

హీరోయిన్ టబు మూడు దశాబ్దాలుగా పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగుతుంది. 1991లో విడుదలైన కూలీ నెంబర్ వన్ లీడ్ హీరోయిన్ గా ఆమెకు మొదటి చిత్రం. టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. దర్శకుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన కూలీ నెంబర్ వన్ సూపర్ హిట్. 

 

26

ఈ మూవీ హిట్ అయినప్పటికీ టబుకి దాదాపు నాలుగేళ్లు గ్యాప్ వచ్చింది. అనంతరం హిందీలో ఆఫర్స్  వచ్చాయి. వరుసగా హిందీ చిత్రాలు చేస్తూ..  నాగార్జున ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేసిన సిసింద్రీ మూవీలో టబు ఓ స్పెషల్ సాంగ్ చేసింది. నాగార్జునకు జంటగా నటించిన నిన్నే పెళ్లాడతా... సూపర్ హిట్ కొట్టింది. తెలుగులో హిట్స్ పడినప్పటికీ టబు బాలీవుడ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. 

36
Tabu

ప్రస్తుతం ఆమె వయసుకు తగ్గ పాత్రలు చేస్తుంది. నెగిటివ్ షేడ్ రోల్స్ కూడా చేయడం విశేషం. అంధాదున్ చిత్రంలో టబు పూర్తి స్థాయి నెగిటివ్ రోల్ చేసి ఆశ్చర్యపరిచింది. గతంలో టబు ఆ స్థాయి విలనీ పండించిన చిత్రం లేదు. అంధాదున్ లో టబు రోల్ కొంచెం బోల్డ్ గా కూడా ఉంటుంది. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో టబు పాత్రకు మంచి పేరొచ్చింది. 


 

46

టబు లేటెస్ట్ మూవీ ఔరోన్ మే కహన్ దమ్ థా. అజయ్ దేవ్ గణ్ హీరోగా నటించారు. టబు, సాయి మంజ్రేకర్ హీరోయిన్స్ గా నటించారు. ఔరోన్ మే కహన్ దమ్ థా ఆగస్టు 2న విడుదల కానుంది. యూనిట్ సభ్యులు చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో టబు కీలక కామెంట్స్ చేశారు. 

56

ఔరోన్ మే కహన్ దమ్ థా చిత్రంలో యశోద పాత్రలో టబు కనిపించనుంది. మిడిల్ ఏజ్ యశోద టబు కాగా.. యంగ్ ఏజ్ యశోదగా సాయి మంజ్రేకర్ చేసింది. అయితే యంగ్ యశోద పాత్ర కూడా టబునే చేయమని దర్శకుడు నీరజ్ పాండే అడిగారట. కానీ టబు చేయను అన్నారట. మన వయసు ఎంతో ప్రేక్షకులకు తెలిశాక, యంగ్ రోల్స్ లో అంగీకరించరు. డీఏజింగ్  టెక్నాలజీ వాడినా ప్రయోజనం ఉందని అన్నారు. 

 

66

ఇకపై యంగ్ రోల్స్ చేయను. వయసుకు తగ్గ పాత్రలే చేస్తానని టబు తేల్చేశారు. హీరోయిన్స్ ఇలాంటి పాత్రలే చేయాలనే ఇమేజ్ చిత్రంలో నేను ఇరుక్కోను అంటుంది టబు. తనకు నచ్చితే ఎలాంటి పాత్ర అయినా చేస్తాను. అందరిలా నేను ఎందుకు ఆలోచించాలి. నేను స్క్రిప్ట్ సెలక్షన్ లో ఖచ్చితంగా ఉంటాను. అందుకే నాకు గొప్ప పాత్రలు వస్తున్నాయని ఆమె అన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories