అదే ఏడాది ఆది మూవీతో జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొట్టి స్టార్ హీరోల లిస్ట్ లో చేరాడు. జూనియర్ ఎన్టీఆర్ కి తారకరత్న ఏవిధంగానూ పోటీ ఇవ్వలేకపోయాడు. ఒక దశలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు థియేటర్స్ ఇవ్వొద్దని బాలకృష్ణ ఆదేశాలు జారీ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి.
హరికృష్ణ టీడీపీకి దూరమయ్యాక జూనియర్ ఎన్టీఆర్-బాలకృష్ణ మధ్య సఖ్యత లేదు. హరికృష్ణ మరణం తర్వాత కూడా వారు కలవలేదు. భువనేశ్వరి పై వైసీపీ నేతల ఆరోపణలు, చంద్రబాబు అరెస్ట్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ వైఖరిని టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు జూనియర్ హాజరు కాలేదు. ఈ పరిణామాలతో నందమూరి ఫ్యాన్స్ రెండుగా విడిపోయారు.