పొట్టిదైన పూల గౌను అందాలు దాయలేక ఇబ్బంది పడుతుండగా జాన్వీ పరువాల విందు.. ఐకాన్‌ స్టార్‌పై అదిరిపోయే కామెంట్‌

Published : Jan 10, 2022, 08:32 PM ISTUpdated : Jan 10, 2022, 08:40 PM IST

అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్‌.. ఇంటర్నెట్‌లో సెన్సేషనల్‌ స్టార్‌గా పేరు తెచ్చుకుంటుంది. అందాల ఆరబోతలో తగ్గేదెలే అనిపించుకుంటున్న ఈ హాట్‌ బ్యూటీ ఐకాన్‌ స్టార్‌పై మైండ్‌ బ్లోయింగ్‌ కామెంట్‌ చేసింది.   

PREV
19
పొట్టిదైన పూల గౌను అందాలు దాయలేక ఇబ్బంది పడుతుండగా జాన్వీ పరువాల విందు.. ఐకాన్‌ స్టార్‌పై అదిరిపోయే కామెంట్‌

జాన్వీ కపూర్‌ లేటెస్ట్ గా పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. పూల పూల గౌనులో జాన్వీ పులకరించిపోయింది. పరువాలు విందుకి తెరలేపింది. ప్రస్తుతం ఈ అమ్మడి హాట్‌ పిక్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. నెటిజన్లకి మైండ్‌ బ్లాక్‌ చేస్తున్నాయి. జాన్వీ అందాలను చూసేందుకు ఇంటర్నెట్‌ కుర్రాళ్లు ఎగబడుతుండటం విశేషం. 

29

జాన్వీ కపూర్‌.. `ఫెమినా` మేగజీన్‌ కోసం ఈ అందాల విందుని వడ్డించింది. పొట్టి దుస్తుల్లో హాట్‌ షో చేసింది. దీంతో ఇప్పుడీ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ, అభిమానులను కనువిందు చేస్తున్నాయి.  

39

ఇదిలా ఉంటే జాన్వీ కపూర్‌ ట్రెండీ వేర్స్  ధరించి హోయలు పోతూ ఫోటోలకు పోజులివ్వగా అవి ఆద్యంతం కనువిందు చేస్తున్నాయి. కట్టిపడేస్తున్నాయి. ఇలా రెగ్యూలర్‌గా గ్లామర్‌ పిక్స్ తో సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది జాన్వీకపూర్. 

49

ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపించింది. ఇన్‌స్టా స్టోరీస్‌లో ఆమె అదిరిపోయే కామెంట్‌ చేసింది. `అల్లు అర్జున్‌ ప్రపంచంలోనే కూలెస్ట్ మ్యాన్‌` అంటూ ప్రశంసలు కురిపించింది. `పుష్ప` సినిమా చూసిన ఆమె బన్నీపై ఇలాంటి కామెంట్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. జాన్వీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. 

59

ఓ రకంగా బన్నీ ఫ్యాన్స్ ని తనవైపు తిప్పుకునేందుకే ఈ భామ ఇలాంటి షాకింగ్‌ కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే జాన్వీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. 

69

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌ని ఆకాశానికి ఎత్తేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక బన్నీ నటించిన `పుష్ప` చిత్రం హిందీలో బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సాధించింది. భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. హిందీ వెర్షన్‌ `పుష్ప` ఏకంగా 80కోట్లు వసూలు చేయడం విశేషం. 

79

మరోవైపు డల్‌ మూడ్‌లో ఉన్న పిక్స్ ని పంచుకుంది జాన్వీ. నోట్లో థర్మామీటర్‌ పెట్టుకుని కనిపించింది. దీంతో ఆమెకి కరోనా సోకిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. బెడ్‌పై డల్‌గా కనిపించింది జాన్వీ. దీంతో అనేక సందేహాలు కలుగుతున్నాయి. 

89

అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో షూటింగ్‌లు ఆగిపోతున్నాయి. సినిమాలు విడుదల ఆగిపోయాయి. చాలా వరకు వాయిదా పడుతున్నాయి. దీంతో ఇప్పుడు మళ్లీ లాక్ డౌన్‌ పరిస్థితి తలెత్తింది. ముంబయిలో భారీగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లని రన్‌ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 

99

దీంతో ఇంట్లోనూ కూర్చునే పరిస్థితి నెలకొంది. దీంతో సినిమాలు చూస్తూ, బుక్స్ చదువుతు, తనకు నచ్చిన పెయింటింగ్‌ వేస్తూ రిలాక్స్ అవుతుంది జాన్వీ కపూర్‌. అయా పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుని ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories