ప్రియుడితో అడ్డంగా దొరికిపోయిన జాన్వీ కపూర్, ముఖం చాటేసిన జూనియర్ శ్రీదేవి

First Published Jan 7, 2023, 1:53 PM IST

బాలీవుడ్ యంగ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ అడ్డంగా దొరికిపోయింది. ఇప్పటిదాకా రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ గా ఉన్న వ్యక్తితో షికారు చేస్తూ దొరికిపోయింది.  

Image: Janhvi Kapoor Instagam

అతిలోకసుందరి దివంగత శ్రీదేవి వారసురాలిగా  బాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యింది జాన్వీ కపూర్.. వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అటు సినిమాలు.. ఇటు సోషల్ మీడియాలో హాట్ హాట్ పిక్స్ తో.. నెట్టింట మంటలు పుట్టిస్తుంది. 
 

అంతే కాదు సినిమాలు చేస్తూనే టైమ్ దొరికినప్పుడల్లా.. వెకేషన్స్ కు వెళ్తూ.. అక్కడ కూడా అదిరిపోయే అందాలతో విందు చేస్తుంటుంది. అంతే కాదు తను ఒక్కతే కాకుండా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఎంజాయ్ చేస్తుంటుందని అంటుంటారు. కాని పెద్దగా ఇద్దరు కనిపించింది లేదు. 

జాన్వీ కపూర్ రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ తోనే టూర్లకు వెళ్తుందట.. కాని కలిసున్న ఫోటోలు మాత్రం బయటకు రాకుండా చూసుకుంటుంటారు. అయితే వీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఏదో ఒక చోట దోరక్కుండా ఉండరు కదా..? అప్పుడప్పుడు కెమెరా కంటికి వీరు చిక్కుతూనే ఉన్నారు. దాంతో  వీరి గురించి నెటింట రకరకాల వార్తలు చక్కర్లు కొడుతుంటాయి. 
 

ఈక్రమంలో మరోసారి వీరు కెమెరా కంటికి దొరికిపోయారు. రీసెంట్ గా జాన్వీ తన సోదరి రియా కపూర్ ఇంట్లో పార్టీకి హాజయ్యేందుకు కారులో వెళ్ళింది. అయితే అక్కడి మీడియా కంటపడకుండా సిగ్గుపడుతూ ఈమె ముఖానికి చేతులు అడ్డుపెట్టుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. కారులో ఆమెతో పాటు మరో వ్యక్తి కూడా ఉండటం వైరల్ అవుతుంది.

ఆమెతో పాటు కారులో నుండి మరో వ్యక్తి  ఉన్నాడు..అతను మరెవరో కాదు కొద్దిరోజులుగా జాన్వీ ఓ అబ్బాయితో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి.అతనే శిఖర్ పహారియా.. ఇప్పుడు జాన్వీ.. ఈ పార్టీకి అతనితోనే కలిసి వచ్చింది. అందుకే ఆమె మీడియాని ఫేస్ చేయడానికి ఇబ్బంది పడింది. 

జాన్వీ కపూర్ చాలా పార్టీలకు వెళ్తుంటుంది. కాని ఏ పార్టీకి వెళ్లినా చాలా ఫ్రీగా ఉంటుంది..ఇలా ఇబ్బది పడదు. కాని జాన్వీ కపూర్ ఈ పార్టీకి వచ్చినప్పుడు మాత్రం కెమెరాలు కనిపించగానే ఫోజులివ్వడానిక బదులు.. కాస్త ఇబ్బంది పడింది.  ఆమె తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి రావడం మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకు ముందు కూడా ఈ ఇద్దరూ కలిసి చాలా పార్టీల్లో కనిపించారు.

ఈమె నటించిన సినిమాల్లో ఒక్కటి కూడా సూపర్ హిట్ అవ్వలేదు. ఒకటి, రెండు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. అందువల్ల ఈమె బాలీవుడ్లో పెద్ద సక్సెస్ అందుకోలేకపోయింది. అందుకే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ.. క్లీవేజ్ షోలు, థైస్ షోలు ఇలా ఎందులోనూ కూడా ఆమె తగ్గడం లేదు.. హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ యూత్ ను గుప్పెట్లో పెట్టుకుంటుంది.
 

click me!