తనను పెళ్ళి చేసుకోవాలి అంటే.. కండీషన్స్ అప్లై అంటున్న జాన్వీ కపూర్.. పెద్దలిస్ట్ బయటపెట్టిన బాలీవుడ్ బ్యూటీ

First Published | Apr 24, 2023, 8:44 AM IST

తన పెళ్ళి అంటే అంత ఈజీ కాదు అంటోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్. దానికి కొన్ని కండీషన్లు ఉన్నాయంటోంది. ముఖ్యంగా తనను పెళ్ళి చేసుకునే వ్యాక్తికి కొన్నిక్వాలిటీస్ ఉండాలి అంటూ..కోరికల చిట్టాను బయట పెట్టింది బ్యూటీ.  ఇంతకీ ఏంటా కోరికలు. 

Image: Janhvi Kapoor Instagram

కమర్షియల్ సినిమాలు చేయకపోయినా.. బాలీవుడ్  మాత్రం స్టార్ హీరోయిన్ స్టేటస్ సాధించింది జాన్వీ కపూర్. బీటౌన్ లో ఆమె క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇటు సౌత్ లో సినిమాలు చేయకపోయినా.. జాన్వీకి ఇక్కడ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జాన్వీ కపూర్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. జాన్వీ నటించిన సినిమాలలో హిందీలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. 
 

Image: Janhvi Kapoor Instagram

ఇక సౌత్ లో ఉన్న క్రేజ్ ను ఇంకా పెంచుకోవడం కోసం.. జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. తారక్ జోడీగా ఎన్టీఆర్30 మూవీ తో  టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది జాన్వీ. ఇక్కడ కూడా సక్సెస్ సాధించి  పాన్ ఇండియా హీరోయిన్ గా మారాలి అని ప్లాన్ చేసింది బ్యూటీ. 


సౌత్ సినిమాల్లో కూడా సక్సెస్ సాధించి.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతానని భావిస్తుంది జాన్వీకపూర్.  అయితే ప్రస్తుతం తన  తాన పెళ్లి వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో తాను  చేసుకునే వ్యక్తిలో కొన్ని లక్షణాలు ఉండాలంటూ.. కండీషన్లు పెడుతుంది  జాన్వీ. తన మనస్సులోని కోరికలను బయటపెడుతున్నారు. అవేంటంటే..? 

నా వృత్తిని గౌరవించే వ్యక్తి నా జీవితంలోకి రావాలని నేను కోరుకుంటున్నానని ఆమె అన్నారు. ఎవరైతే నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటారో ఆ వ్యక్తికి మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలంటోంది జాన్వీ. తెలియని విషయాలను నేర్చుకుంటే ఆ విషయాలను ఉత్సాహంగా నేర్పించే వ్యక్తి తనకు కావాలని జాన్వీ కపూర్ కామెంట్లు చేశారు. 

అంతే కాదు నన్ను కేరింగ్ గా చూసుకోవాలి.. నాతో  ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి.  అలాంటి వ్యక్తి  మాత్రమే కావాలని ఆమె వెల్లడించారు. అంతే కాదు మరీ ముఖ్యంగా  నన్ను చేసుకోబోయే వ్యక్తి నా తండ్రి కంటే ఎక్కువ హైట్ ఉండాలని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చారు. 

Janhvi Kapoor-Sridevi's daughter who is 'captured' again with her boyfriend

ప్రస్తుతం యంగ్ బిజినెస్ మెన్ శిఖర్ పహారియాతో ప్రేమలో ఉంది జాన్వీ. ఈ విషయం అఫీషియల్ గా వెల్లడించకపోయినా.. తనతో కలిసి టూర్లు.. షికార్లు అంటూ తిరుగుతోంది. మరి ఈ క్వాలిటీస్ అతనిలో కనిపించాయా..? లేక అతను డేటింగ్ వరకేనా అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. 

Janhvi Kapoor

ఇక తన కెరీర్ గురించి మరికొన్ని విషయాలు పంచుకున్నారు జాన్వీ. మిలి మూవీ షూట్ సమయంలో నా ఆరోగ్యం దెబ్బ తిందని ఆమె మరోక్కసారి వెల్లడించారు. నాకు స్ట్రీట్ ఫుడ్ అంటే ఎంతో ఇష్టమని జాన్వీ కపూర్ పేర్కొన్నారు. ముంబై స్ట్రీట్స్ లో తిరుగుతూ.. నచ్చిన తిండి తింటానని ఆమె కామెంట్లు చేశారు. తన సినిమాల గురించి కూడ  కొన్ని విషయాలు జాన్నీ కపూర్ వెల్లడించారు. 

ఇక  జాన్వీ చెప్పిన ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్30 సినిమాలో ఈ బ్యూటీ మత్స్యకారుని కూతురి రోల్ లో కనిపించనున్నారని ఆ రోల్ సినిమాకు చాలా ఇంపార్టెంట్ అని. సినిమా కథను మలుపుతిప్పే పాత్ర జాన్వీ కపూర్ పోషిస్తుంది అంటున్నారు. అంతే కాదు ఎన్టీఆర్ 30 లో కీలక ట్విస్ట్ లకు జావ్వీ పాత్ర  కారణం అవుతుందని తెలుస్తోంది.

Latest Videos

click me!