janaki kalaganaledhu: వారసులకోసం అన్నీ సిద్ధం చేసిన జ్ఞానాంబ.. ఆలోచనలో జానకి, రామచంద్ర!

Published : Jul 12, 2022, 02:28 PM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జులై 12 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
15
janaki kalaganaledhu: వారసులకోసం అన్నీ సిద్ధం చేసిన జ్ఞానాంబ.. ఆలోచనలో జానకి, రామచంద్ర!

 ఈరోజు ఎపిసోడ్ లో పాటల కార్యక్రమం ముగియడంతో అందరూ సంతోషంగా ఉంటారు. ఇంతలోనే చికిత అందరూ కలిసి డాన్స్ వేద్దాం అని అనగా అప్పుడు అందరూ అందుకు సరే అని అనడంతో మల్లిక నేను డ్యాన్స్ వేస్తాను అని చెప్పి విష్ణుని లాక్కొని వెళ్తుంది. ఆ తర్వాత మల్లిక వాళ్ళు డాన్స్ వేసి రాగా ఇంతలో గోవిందరాజులు మల్లిక పై సెటైర్లు వేయగా అప్పుడు జ్ఞానాంబ లేదు మల్లిక బాగానే డాన్స్ వేశావు అంటూ మెచ్చుకుంటుంది.
 

25

ఆ తర్వాత రామచంద్ర,జానకి ఇద్దరు డాన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు రొమాంటిక్ గా వేస్తుండడంతో మల్లిక అది చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది. అప్పుడు జ్ఞానాంబ మల్లిక రామచంద్రాలను ఒకటి చేయడం కోసం జ్ఞానాంబ దంపతులు ఒక ప్లాన్ వేస్తారు. అప్పుడు జ్ఞానాంబ వాళ్లు మాకు పని ఉంది అని చెప్పి జానకి దంపతులు,మల్లిక దంపతులను అక్కడే సాయంత్రం వరకు ఎంజాయ్ చేసిన రమ్మని చెప్పి వెళ్ళిపోతారు.
 

35

 మరొకవైపు జ్ఞానాంబ దంపతులు జానకి వాళ్ల కోసం రూమ్ ని మొత్తం పూలతో అలంకరిస్తూ ఉంటారు. అప్పుడు గోవిందరాజులు వారి పెళ్లినాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని మురిసిపోతూ ఉంటాడు. ఆ తర్వాత ఇద్దరూ వారసుడి గురించి తలచుకొని బాధపడతారు. ఇంతలోనే జానకి వాళ్ళు ఇంటికి రావడంతో అప్పుడు జ్ఞానాంబ వాళ్ళు ఈరోజు గుళ్లో నిద్ర చేస్తే మంచిదట. జానకి రామచంద్ర, మల్లిక విష్ణులను ఇంట్లోనే ఉండమని చెబుతుంది.
 

45

అప్పుడు మల్లికా నేను కూడా గుడికి వస్తాను అని అనగా వెంటనే జ్ఞానాంబ మీరు ఇంట్లోనే ఉండి దేవుడికి దీపం వెలిగించండి అని చెబుతుంది. ఆ తర్వాత జానకిని పక్కకు పిలుచుకొని వెళ్లి అసలు విషయాలు చెబుతుంది. అప్పుడు మల్లిక జ్ఞానాంబ వాళ్ళు ఏమి మాట్లాడుకుంటున్నారు అని తెగ ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే గోవిందరాజులు మల్లికా పై సెటైర్స్ వేస్తాడు.
 

55

ఆ తర్వాత రామచంద్ర జానకి రూమ్ లోకి వెళ్లి చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు జానకి అత్తయ్యకి ఇచ్చిన మాటనే ముందు నిలబెట్టుకుందాం అని అనగా అప్పుడు రామచంద్ర వద్దు ముందు మీ ఐఏస్ పూర్తి అయిన తరవాత అమ్మ వాళ్ళకు ఇచ్చిన మాట గురించి ఆలోచిద్దాం అని చెబుతాడు రామచంద్ర. దాంతో జానకి కూడా అందుకు సరే అని అంటుంది.

click me!

Recommended Stories