యూఎస్ లో బాలీవుడ్ స్టార్ కపుల్ హంగామా.. వైరల్ అవుతున్న రణవీర్ సింగ్, దీపికా పదుకొణె రొమాంటిక్ పిక్స్..

Published : Jul 12, 2022, 03:07 PM ISTUpdated : Jul 12, 2022, 03:13 PM IST

బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్ - దీపికా పదుకొణె యూస్ వేకేషన్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మునుపెన్నడూ లేనంతలా రణబీర్, దీపికాల రొమాంటిక్  పిక్స్ ను స్టార్ కపుల్ తమ అభిమానులతో పంచుకోవడం విశేషం.

PREV
16
యూఎస్ లో బాలీవుడ్ స్టార్ కపుల్ హంగామా.. వైరల్ అవుతున్న రణవీర్ సింగ్, దీపికా పదుకొణె రొమాంటిక్ పిక్స్..

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ (Ranveer Singh), స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) నాలుగేండ్ల కిందనే లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి స్టార్ కపుల్ గా వీరి దాంపత్య జీవితం స్ఫూర్తివంతంగా కొనసాగుతోంది. 

26

అయితే ప్రస్తుతం ఈ స్టార్ జంటకు సంబంధించిన  గ్రూప్ ఆఫ్ పిక్స్ రొమాంటిక్ పిక్స్  నెట్టింట వైరల్ అవుతున్నాయి. రణవీర్ - దీపికా మునుపెన్నడూ లేనంతలా తమ ప్రేమను, మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయి చేస్తున్నట్టుగా ఫొటోలను పంచుకుంటున్నారు. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
 

36

కాగా రణవీర్ సింగ్ 37వ పుట్టిన రోజు సందర్భంగా ఈ జంట అమెరికాలో వారం పాటు గడిపింది. జూలై 6న రణవీర్ సింగ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను  అక్కడే గ్రాండ్ గా నిర్వహించారు. వీక్ మొత్తం  సరదగా ఒకరితో ఒకరు సమయం గడిపారు. పలు పర్యాటక ప్రాంతాలు, బీచ్ ల్లో సందడి చేశారు. బైక్ రైడ్స్ కూడా చేసి ఆకట్టుకున్నారు.
 

46

అప్పటి ఫొటోలను, పలు వీడియోలను రణవీర్ సింగ్, దీపికా తాజాగా తమ అభిమానులతో ఇలా షేర్ చేసుకున్నారు. తమ వివాహామైన నాలుగేండ్లలో ఇంతలా ఈ జంట కలిసి ఎన్నోసార్లు కలిసి టూర్స్ కు వెళ్లిన ఇంతలా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం వీరిద్దరూ సోషల్ మీడియాలో పోటీపడుతూ వారి వేకేషన్ పిక్స్ ను షేర్ చేస్తుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. 
 

56

ఇక రణవీర్ - దీపికాల వివాహా జీవితం స్ఫూర్తిదాయకంగానే కొనసాగుతోంది. పెళ్లి చేసుకున్నా.. దీపికా సినిమాలకు దూరం కాలేదు. రణవీర్ పూర్తి మద్దతు ఇవ్వడంతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్  బిగ్ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. దీపికా నటించే సినిమాలపై రణవీర్ అభ్యంతరాలు వ్యక్తం చేయకపోగా సపోర్ట్ గా నిలుస్తుండటం విశేషం. ‘గెహ్రైయాన్’లో దీపికా బోల్డ్ సీన్లలో నటించినా రణవీర్ సింగ్ వృత్తి ధర్మంగానే భావించినట్టు తెలిపిన విషయం తెలిసిందే.
 

66

కేరీర్ విషయంలో.. రణవీర్ ఇటీవల ‘జయేష్ బాయ్ జోర్దార్’తో అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘సర్కస్’,‘రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇక దీపికా పదుకొణె కూడా బిగ్ ప్రాజెక్ట్ లో నటిస్తుంది. ప్రభాస్ తో ‘ప్రాజెక్ట్ కే’, షారుఖ్ ఖాన్ తో ‘పఠాన్’లో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే భర్తతో  కలిసి ‘సర్కస్’లోనూ కనువిందు చేయనుంది.

Read more Photos on
click me!

Recommended Stories