జాన్వీ కపూర్ తో ఎఫైర్ కన్ఫర్మ్ చేసిన రూమార్డ్ బాయ్ ఫ్రెండ్..? ఆ ప్రైవేట్ చాట్ లీక్, ఆపై డిలీట్!

First Published | Nov 8, 2023, 11:18 AM IST

జాన్వీ కపూర్ ఫై ఎఫైర్ రూమర్స్ కొత్తేమీ కాదు. టీనేజ్ నుండే అమ్మడుపై పలు రూమర్స్ ఉన్నాయి. ఈ మధ్య ఎక్కువగా శిఖర్ పహరియా పేరు వినిపిస్తోంది. ఆయన తాజాగా చేసిన కామెంట్ చర్చకు దారి తీసింది. 
 

Janhvi Kapoor

జాన్వీ కపూర్ బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్ పెద్దదే. సినిమాల్లోకి రాకముందే స్టార్ కిడ్ గా ఆమె పరిచయాలు పతాక శీర్షికలు ఎక్కాయి. జాన్వీ కపూర్ డెబ్యూ మూవీ ధడక్ హీరో ఇషాన్ ఖత్తర్, అక్షత్ రాజన్, హీరో కార్తీక్ ఆర్యన్ ఈ లిస్ట్ లో ఉన్నారు. ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తున్న పేరు శిఖర్ పహరియా. 
 

శిఖర్-జాన్వీ మధ్య పరిచయం చాలా కాలంగా ఉంది. ఆ మధ్య బ్రేకప్ అయ్యారంటూ కథనాలు వెలువడ్డాయి. మరలా జంటగా కనిపిస్తున్న నేపథ్యంలో పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయి. శిఖర్, జాన్వీ తరచుగా డిన్నర్ డేట్స్ కి వెళుతుంటారు. బాలీవుడ్ సెలెబ్స్ పార్టీలకు జంటగా హాజరవుతారు.


బోనీ కపూర్, ఖుషి కపూర్లతో కూడిన జాన్వీ ఫ్యామిలీ ట్రిప్స్ లో కూడా శిఖర్ కనిపించడం కొసమెరుపు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన జాన్వీ పక్కన శిఖర్ కనిపించాడు. శిఖర్ తో జాన్వీ సన్నిహితంగా ఉండటం బోనీ కపూర్ కి ఇష్టం లేదట. ఆయన కోపంగా ఉన్నారనే వాదన కూడా ఉంది. 

 

జాన్వీ కపూర్, శిఖర్ ఈ డేటింగ్ రూమర్స్ పై స్పందించింది లేదు. తాజాగా శిఖర్ కామెంట్ చర్చకు దారి తీసింది. ఈ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా శిఖర్ జాన్వీతో తన లవ్ కన్ఫర్మ్ చేశాడని చిత్ర వర్గాల్లో చర్చ జరుగుతుంది. 


శిఖర్ పార్టీలో ఓ అమ్మాయితో డాన్స్ చేశాడట. అందుకు నొచ్చుకున్న జాన్వీ ... శిఖర్ సోషల్ మీడియా పోస్ట్ క్రింద 'ఎవరు ఆ పింక్ గర్ల్?' అని కామెంట్ చేసింది. అందుకు వీరిద్దరి కామన్ ఫ్రెండ్ ఒర్రి అవత్రమని 'పరుగెత్తు' అని కామెంట్ చేశాడు. జాన్వీకి కోపం వచ్చింది నిన్ను నువ్వు కాపాడుకో అనే అర్థంలో ఒర్రి అలా కామెంట్ చేశాడు. 
 

Janhvi Kapoor

జాన్వీ కపూర్ సందేహం తీరేలా... శిఖర్ 'నేను నీ వాడిని' (ఐ యామ్ ఆల్ యువర్స్) అని కామెంట్ చేశాడు. దీని అర్థం జాన్వీ కపూర్-శిఖర్ రిలేషన్ లో ఉన్నారు. అందుకు అతని సోషల్ మీడియా పోస్ట్ నిదర్శనం అంటున్నారు. ఈ కామెంట్ ని శిఖర్ డిలీట్ చేశాడు. అప్పటికే నెటిజెన్స్ స్క్రీన్ షాట్స్ తీసి వైరల్ చేస్తున్నారు.

Janhvi Kapoor

శిఖర్ పహరియా పొలిటికల్ ఫ్యామిలీకి చెందినవాడు. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు. బాలీవుడ్ సెలెబ్స్, స్టార్ కిడ్స్ తో సన్నిహిత సంబంధాలున్న శిఖర్ హై ఫైవ్ అనుభవిస్తూ ఉంటాడు. శిఖర్ సోషల్ మీడియా పోస్ట్ తో జాన్వీ ఎఫైర్ కథనాలు హల్చల్ చేస్తున్నాయి. 

జాన్వీ కపూర్ తెలుగులో దేవర చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కి జంటగా ఆమె బంపర్ ఆఫర్ కొట్టేసింది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కుతున్న ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. 2024 ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. 

Latest Videos

click me!