బ్రహ్మముడి సీరియల్: రాజ్ కి తాతయ్య చివరి కోరిక, ఆగిపోయిన కళ్యాణ్ పెళ్లి...!

First Published | Nov 8, 2023, 10:24 AM IST

తాతయ్య ఆరోగ్యం కారణంగా కళ్యాణ్ పెళ్లి కొంతకాలం వాయిదా పడినట్లే, ఈ గ్యాప్ లో అప్పు తన మనసులో మాట కళ్యాణ్ కి చెబుతుందేమో చూడాలి.

Brahmmamudi

తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న తెలుగు సీరియల్స్ లో బ్రహ్మముడి ఒకటి. ఈ సీరియల్ మొదలైన రోజు నుంచి ప్రేక్షకులను కట్టిపడేసింది. నిన్నటి ఎపిసోడ్ లో రాజ్ తాతయ్య సీతారామయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఎక్కువ కాలం జీవించడనే నిజం తెలిసిపోయింది. ఆ తర్వాత నేటి ఎపిసోడ్ లో ఏం జరిగింది? ఆయన కావ్యకు ఎలాంటి న్యాయంచేశాడో ఇప్పుడు తెలుసుకుందాం. టీవీలో ప్రసారం కాకముందే, నేటి ఎపిసోడ్ ని మేము మీకు అందిస్తున్నాం..

Brahmmamudi 5

Brahma mudi Serial: సీన్ ఓపెన్ చేయగానే సీతారామయ్య అనారోగ్యం వార్త తెలిసి అందరూ దీనంగా ఉంటారు. సీతా రామయ్య  సోఫాలో కూర్చొని కావ్య, రాజ్ లను పిలుస్తాడు. ఆయన తన చివరి కోరికగా, కావ్యను భార్యగా స్వీకరించమని రాజ్ ని కోరుకుంటాడు. ఇన్ని జరిగినా, ఈ ఇల్లు ముక్కు కోరుకోకూడదని  తన లాగే కావ్య కూడా కోరుకుందని, నీ మంచి తనమే నీకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది అంటూ కావ్యను ఉద్దేశించి సీతారామయ్య అంటాడు. వెంటనే, సీతారామయ్య అనుకున్నవన్నీ జరిగేలా తాను చూసుకుంటానని, ముందు విశ్రాంతి తీసుకోండి అంటూ, చిట్టి సీతారామయ్యను తన గదిలోకి తీసుకువెళ్తుంది.


Brahmmamudi 2

ఇక, తమ ఇంట్లో కావ్య తల్లిదండ్రులు కంగారు పడుతూ ఉంటారు. తమ పిల్లల గురించి అక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారా అని వారు కంగారు పడుతూ ఉంటారు. స్వప్న  కోసం కాకపోయినా, కావ్య కోసం వెళ్లాలి అని కనకం భావిస్తూ ఉంటుంది. మరోసారి కావ్య ఇంట్లో నుంచి వెళ్లిపోతుందేమో అని భయం వేసి, కావ్య ఎలా ఉందో తెలుసుకోవడానికి ఫోన్ చేస్తుంది. అప్పుడు కావ్య, తన అత్త ఇంట్లో జరిగిన అసలు విషయాన్ని వివరిస్తుంది.

Brahmmamudi 3

తాతయ్య తమకు సపోర్ట్ గా నిలిచారని, కానీ, తాతయ్యకు క్యాన్సర్ అని, ఆఖరి స్టేజ్ లో ఉన్నారని డాక్టర్లు చెప్పారంటూ ఏడుస్తూ చెబుతుంది. తనకు బాధలో మాటలు రావడం లేదు అని ఫోన్ పెట్టేస్తుంది. దీంతో, వెళ్లి సీతారమయ్యను పలకరించాలని కనకం దంపతులు బయలు దేరతారు.

Brahmmamudi 7

మరోవైపు అనామిక, కళ్యాన్ కి ఫోన్ చేస్తుంది. పెళ్లి గురించి, తన తండ్రి మాట్లాడమని చెప్పాడని, ముహూర్తాలు పెట్టుకోవడం గురించి మాట్లాడాలి అని అనామిక చెబుతుంది. అయితే, ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందామని కళ్యాణ్ చెబుతాడు. ఏం జరిగిందని అనామిక ఆరా తీయగా, తన తాతయ్యకు క్యాన్సర్ అనే విషయాన్ని బయటపెడతాడు. ఇంట్లో అందరూ ఈ విషయం తెలిసి డిస్టర్బ్ గా ఉన్నారని, ఈ సమయంలో పెళ్లి గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు కదా అని కళ్యాణ్ చెప్పగా, దానికి అనామిక సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి సమయంలో పెళ్లి గురించి అడగమని తాను మాత్రం ఎందుకు చెబుతానని అనామిక అంటుంది. సమయం తీసుకొని నిర్ణయం తీసుకుందామని కళ్యాణ్ కి సపోర్ట్ గా నిలుస్తుంది.


మరో వైపు సీతారామయ్య అనారగ్యం విషయం తనకు చెప్పలేదని అపర్ణ బాధపడుతూ ఉంటుంది. ఇదే విషయాన్ని భర్తతో మాట్లాడుతూ ఉంటుంది. తనకు చెప్పలేదని పెద్ద పెద్ద డైలాగులతో రాద్దాంతం చేస్తూ ఉంటుంది. భర్త సముదాయించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే సరిగ్గా కావ్య తల్లిదండ్రులు అక్కడికి వస్తారు. అంతే, అపర్ణ మళ్లీ గొడవ మొదలుపెడుతుంది. మీ ఇద్దరు కూతుళ్లు చేసిన పనికి అందరం కుదేళ్లు అయిపోయాం అంటూ సీరియస్ అవుతారు.
 

దీంతో, కనకం సర్దిచెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. గొడవ కోసం రాలేదు అని చెబుతుండగానే, మీ కూతుళ్లను తీసుకువెళ్లడానికి వచ్చారా ? కూతుళ్లను పెంచడం రాదు అంటూ చాలా మాటలు అంటూ ఉంటుంది. మరోసారి కావ్య తల్లిదండ్రులకు అవమానం తప్పలేదు. సీతారామయ్య గారిని చూసి వెళ్లడానికి వచ్చామని, కానీ రాకూడని సమయంలో వచ్చామని కనకం దంపతులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుంటారు. దీంతో, సుభాష్ వాళ్లని ఆపి, తన తండ్రిని చూసి వెళ్లమని చెబుతాడు. దీంతో వాళ్లు లోపలికి వెళతారు.

ఇక, ఇంట్లో అన్ని గొడవలకు అపర్ణే కారణం అంటూ సుభాష్ ఆమెను తిడతాడు.ముందు ఆమెను మారమని, ఆ తర్వాత ఇంట్లో వాళ్లను మారమని సలహా ఇస్తాడు. ఇక, కనకం దంపతులు ఇంట్లోకి వెళ్లగానే కావ్య ఎదురౌతుంది.  కావ్యతో మాట్లాడిన తర్వాత పెద్దాయన గదిలోకి వెళ్లి, ఆయనను పలకరిస్తారు. ఆయన ఆరోగ్యం సరిగా లేకున్నా, తమ పిల్లల జీవితాలను బాగు చేశారంటూ కనకం దంపతులు నమస్కరిస్తారు. ఆయనకు దన్యవాదాలు తెలియజేస్తారు.

ఇక, మరోవైపు స్వప్న, రాహుల్ లు గొడవ పడుతూ ఉంటారు. స్వప్న కడుపు పేరుతో నువ్వే నన్ను మోసం చేశావ్ అని రాహుల్ నిలదీస్తాడు. అయితే, స్వప్న రివర్స్ కౌంటర్ ఇస్తుంది. నువ్వే నా దగ్గర డబ్బు లేదని, నన్ను వాడుకొని వదిలేసి, మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నావ్ అంటూ గట్టిగా వాదిస్తుంది. ఇదే విషయంపై ఇద్దరూ చాలా గట్టిగా గొడవ పడతారు. ఈ క్రమంలో రాహుల్  స్వప్న క్యారెక్టర్ ని తక్కువ చేసి మాట్లాడతాడు. దీంతో, స్వప్న మండిపడుతుంది. తాను ప్రేమించాను కాబట్టి, డబ్బు లేదని తెలిసినా నిన్ను పెళ్లి చేసుకున్నాను అంటూ రాహుల్ తో చెబుతుంది. వీళ్ల గొడవ విని సీన్ లోకి రుద్రాని ఎంటర్ అవుతుంది. ఇద్దరినీ, గొడవ ఆపమని వార్నింగ్ ఇస్తుంది. తాతయ్య మీద ప్రేమ లేకున్నా, ఉన్నట్లు నటించమని స్వప్న, రాహుల్ కి సలహా ఇస్తుంది.

Brahmmamudi 7

  ఇక, రాజ్ తన గదిలో ఆలోచిస్తూ ఉంటాడు. స్వప్న కడుపు విషయంలో కావ్య కూడా తనను మోసం చేసిందని రాజ్ బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే గదిలోకి కావ్య ఎంటర్ అవుతుంది. కావ్య వచ్చిందని రాజ్ అక్కడి నుంచి వెళ్లిపోబోతాడు. దీంతో, కావ్య అతనిని ఆపేస్తుంది.  ఇలా గొడవలు పడిన ప్రతిసారీ మాట్లాడుకోకపోతే, బంధం ఎలా నిలపడుతుందని కావ్య ప్రశ్నించగా, వద్దు అనుకునే బంధం నిలపడకపోయినా ఏమీ కాదని రాజ్ సమాధానం ఇస్తాడు. దీంతో, కావ్య బ్రతిమిలాడే ప్రయత్నం చేస్తుంది. కానీ, రాజ్ వినిపించుకోడు. తాను అబద్దం చెప్పలేదని, తన అక్క కోసం మౌనంగా ఉన్నానని కావ్య చెబుతుంది.

Brahmmamudi 6

కమింగప్ లో, చిట్టి ఎమోషనల్ గా మాట్లాడుతుంది. నా భర్త ప్రాణాన్ని నాకు దానం చేయండి అంటూ కొంగు చాచి కుటుంబ సభ్యులను అడుగుతుంది.  ఎంత ఖర్చు చేసైనా, తన భర్తను కాపాడమని ప్రాధేయపడుతుంది. అయితే, రుద్రాణి ఇక్కడ కూడా తన కక్కుర్తి బుద్ది చూపిస్తుంది. ఎంత ఖర్చు చేసినా ఆస్తి కరుగుతుంది. కానీ ఉపయోగం ఉండదు అని మాట్లాడుతుంది. మరి రేపటి రచ్చ ఎలా ఉంటుందో రేపటి ఎపిసోడ్ లో  చూద్దాం. ఇక, ఇప్పటికి అయితే, , తాతయ్య ఆరోగ్యం కారణంగా కళ్యాణ్ పెళ్లి కొంతకాలం వాయిదా పడినట్లే, ఈ గ్యాప్ లో అప్పు తన మనసులో మాట కళ్యాణ్ కి చెబుతుందేమో చూడాలి.

Latest Videos

click me!