నటిగా పనికిరావన్నారు.. నెపోటిజం, ట్రోల్స్ పై జాన్వీ కపూర్ ఎమోషనల్.. టాప్‌ అందాలతో రచ్చ..

Published : Aug 02, 2022, 10:30 AM IST

ఘాటైన అందాలతో మతిపోగొట్టే జాన్వీ కపూర్ ఎమోషనల్‌ అయ్యింది. తన బోల్డ్ అందాలను ఫిల్టర్‌ లేకుండా పంచుకుంటూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటున్న ఈ భామ లేటెస్ట్ గా బరస్ట్ అయ్యింది.  

PREV
16
నటిగా పనికిరావన్నారు.. నెపోటిజం, ట్రోల్స్ పై జాన్వీ కపూర్ ఎమోషనల్.. టాప్‌ అందాలతో రచ్చ..

జాన్వీ కపూర్‌(Janhvi Kapoor) సోషల్‌ మీడియా సెన్సేషన్‌గా పేరు తెచ్చుకుంది. ఆమె తరచూ గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ ఆద్యంతం కనువిందు చేస్తుంది. సోషల్‌ మీడియాలో అత్యంత క్రేజీ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఈ అమ్మడి ఫోటోల కోసం పోటీపడే నెటిజన్లు కోట్లల్లో ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

26

అంతటి ఫాలోయింగ్‌ సొంతం చేసుకున్న Janhvi ఇప్పుడు తల్లి అతిలోక సుందరి శ్రీదేవి ఇమేజ్‌కి అతీతంగా క్రేజ్‌ని సొంతం చేసుకోవడం విశేషం. తాజాగా ఆమె నటించిన `గుడ్‌ లక్‌ జెర్రీ` చిత్రం ఓటీటీలో జులై 29న విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది. 

36

కెరీర్‌ బిగినింగ్‌లో తనపై వచ్చిన ట్రోల్స్ పై స్పందించింది జాన్వీ. తనని నటిగా పనికి రావంటూ కామెంట్లు చేశారని, నెపోటిజాన్ని ఉద్దేశిస్తూ షాకింగ్‌ కామెంట్లు చేశారని తెలిపింది. కేవలం అమ్మా నాన్నల వల్లే అవకాశాలొస్తున్నాయని, కానీ ఆమెకి నటి అయ్యే అర్హత లేదంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారని తెలిపింది. 

46

స్టార్‌ ఫ్యామిలీ నుంచి రావడంతో తనకు అన్నీ పళ్లెంలోకి వచ్చి చేరాయని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆఫర్లు వచ్చాయని భావిస్తున్నారు. ఈ క్రమంలో తనని బాగా ట్రోల్స్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. పేరెంట్స్ గురించి చెబుతూ, మా పేరెంట్స్ తో నేను విపరీతమైన ప్రేమాభిమానాలు కలిగి ఉన్నానని, దాని కారణంగా తనపై వాళ్లు అదే ప్రేమని చూపించేవారని చెప్పింది. అయితే నిజం ఏంటంటే తనకు నటనంటే ఇష్టమని, దానికోసమే జీవిస్తున్నానని పేర్కొంది జాన్వీ కపూర్. ఈ క్రమంలో ఆమె చాలా ఎమోషనల్‌ అయ్యింది.  

56

పేరెంట్స్ పై తాను చూపించిన ప్రేమకి ఇది రిటర్న్ గిఫ్ట్ లాంటిదని, వారికి నేను నటనతో రిటర్న్ చేస్తున్నానని తెలిపింది.అయితే నేను చేసే పనిని ఎంతో ఆస్వాధిస్తున్నానని, ఆ విషయంలో పూర్తి సంతృప్తితో ఉన్నానని పేర్కొంది జాన్వీ. ఇంకా చెబుతూ, ఇతరులు అవకాశాలు కోల్పోయారనే వాస్తవం పట్ల తనకు గౌరవం ఉందని, అందుకు నేను ఇవ్వగలనని నిర్థారించుకోవడమే నేను చయగలిగిందని గ్రహించానని తెలిపింది. సినిమా కోసం, నటన కోసం తాను ఎంతో కష్టపడుతున్నానని, ఆ కష్టం తనకు మాత్రమే తెలుసని పేర్కొంది జాన్వీ. 

66

జాన్వీ కపూర్‌ నటించిన `గుడ్‌ లక్‌ జెర్రీ`కి మిశ్రమ స్పందన లభిస్తుంది. మరోవైపు ఆమె ఇప్పుడు `మిలి`, `మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి`, `బవాల్‌` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే `మిస్టర్‌ అండ్‌ మిసెస్ మహి`లో జాన్వీ క్రికెటర్‌గా నటిస్తుంది. అందుకోసం ఆమె క్రికెట్‌ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తూ శ్రమించడం విశేషం. ఆ పిక్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories