శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్, ఆమె ప్రియుడు శిఖర్ పహారియా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో వీరి పెళ్లి జరగనుందని ప్రచారం జరిగింది. ఈ వార్తలపై జాన్వీ తండ్రి బోణీకపూర్ స్పందించి అసలు నిజం చెప్పారు.
బాలీవుడ్ 'ధడక్' బ్యూటీ, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. ఆమె సినిమా వల్ల కాదు, తన పెళ్లి వార్తల వల్ల! గత కొన్ని రోజులుగా జాన్వీ, తన లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త బీ-టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.
26
ఈ ఏడాది చివర్లో జాన్వీ, శిఖర్ పెళ్లి ?
జాన్వీ, శిఖర్ ఈ ఏడాది చివర్లో అంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. అంతేకాదు, అంబానీ కుటుంబ వేడుకలు జరిగిన గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోనే వీరి పెళ్లి కూడా అంగరంగ వైభవంగా జరగనుందని గాసిప్స్ వినిపించాయి. ఈ వార్త జాన్వీ అభిమానుల్లో పెద్ద చర్చకే దారితీసింది.
36
ఇవన్నీ కేవలం పుకార్లే
ఈ పెళ్లి వార్తలపై జాన్వీ కపూర్ తండ్రి, ప్రముఖ నిర్మాత బోణీకపూర్‌ను అడగ్గా అసలు విషయం బయటపడింది. ఆయన తన కూతురి పెళ్లి వార్తలను పూర్తిగా కొట్టిపారేశారు. "లేదు, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇవన్నీ కేవలం పుకార్లే" అని ఖరాఖండిగా చెప్పి ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు.
జాన్వీ, శిఖర్ పహారియా బంధం ఈనాటిది కాదు. జాన్వీ సినిమాల్లోకి రాకముందు నుంచే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. మధ్యలో కొంతకాలం దూరమైనా, ఈ మధ్య మళ్లీ కలిశారు. సినిమా ప్రీమియర్ల నుంచి గుడికి వెళ్లే వరకు, శిఖర్ ఎప్పుడూ జాన్వీతోనే ఉంటున్నారు. కపూర్ కుటుంబంలోని ప్రతీ వేడుకలో శిఖర్ కనిపించడం వీరి ప్రేమ ఎంత బలమైందో చెబుతోంది.
56
అతని ప్రేమే నాకు బలాన్నిచ్చింది
ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో జాన్వీ కపూర్ తన ప్రేమ గురించి మొదటిసారి ఎమోషనల్‌గా మాట్లాడారు. "ప్రేమంటే నాకు ఒక భద్రతా భావం. శిఖర్‌తో ఉన్నప్పుడు నాకు ఎలాంటి అభద్రత ఉండదు. అతని ముందు నేను చిన్నపిల్లలా ఉండగలను. నేను నాలా ఉండటానికి అతని ప్రేమే నాకు బలాన్నిచ్చింది" అని చెప్పి తమ బంధం ఎంత గొప్పదో తెలిపారు.
66
'పెద్ది' సినిమాలో జాన్వీ హీరోయిన్‌గా..
ప్రస్తుతానికి పెళ్లి వార్తలు అబద్ధమే అయినా, జాన్వీ తన కెరీర్‌లో మాత్రం ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ బాలీవుడ్ బ్యూటీ ఇప్పుడు సౌత్ సినిమాలపై దృష్టి పెట్టారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' అనే తెలుగు యాక్షన్ సినిమాలో జాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మొత్తానికి పెళ్లికి ఇంకా టైమ్ ఉన్నా, సినిమాల్లో మాత్రం జాన్వీ తన మార్క్ చూపిస్తున్నారు.