అంతే కాదు జాన్వీ కపూర్ క్రేజ్ కేవలం బాలీవుడ్ కి మాత్రమే పరిమితం కావడం లేదు. సౌత్ లో కూడా పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె తొలి ప్రయత్నమే బిగ్ బ్యాంగ్ అన్నట్లుగా మొదలయింది. ఎన్టీఆర్, కొరటాల శివ పాన్ ఇండియా చిత్రం దేవరలో జాన్వీ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం విజయం సాధిస్తే జాన్వీ పాన్ ఇండియా హీరోయిన్ కావడం పక్కా.