వరుణ్ తేజ్ - లావణ్య కంటే ముందు.. ఇటలీలో పెళ్లిచేసుకున్న సెలబ్రెటీలు వీరే!

Sreeharsha Gopagani | Published : Nov 1, 2023 11:53 AM
Google News Follow Us

వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి వివాహం వెడ్డింగ్ డెస్టినేషన్ ఇటలీలో ఈరోజు అంగరంగ వైభవంగా జరుగుతోంది. అయితే ఇప్పటికే ఇటలీలో పెళ్లి చేసుకున్న ప్రముఖుల గురించి తెలుసుకుందాం. 
 

16
వరుణ్ తేజ్ - లావణ్య కంటే ముందు.. ఇటలీలో పెళ్లిచేసుకున్న సెలబ్రెటీలు వీరే!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) - లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈరోజు అంగరంగ వైభవంగా కుటుంబీకులు, అతిథుల మధ్య VarunLav ఒక్కటి కాబోతున్నారు. ఈరోజు మధ్యహ్నాం దివ్యమైన ముహుర్తానికి వరుణ్ లావణ్య మేడలో తాళి కట్టబోతున్నారు. 
 

26

అయితే, వరుణ్ - లావణ్య వివాహం ఇటలీలో జరుగుతున్న తరుణంలో.. ఈ వెడ్డింగ్ డెస్టినేషన్ లో ఇంకెవరెవరు ఇండియన్ సెలబ్రెటీలు పెళ్లి చేసుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్ ప్రముఖ నటి రాణి ముఖర్జి (Rani Mukerji)  - ఫిల్మ్ మేకర్ ఆదిత్యా చోప్రా వివాహం కూడా ఇటలీలోనే జరిగింది. బెంగాళీ సంప్రదాయ పద్ధతితో 2014 ఏప్రిల్ 21న ఒక్కటయ్యారు. 
 

36

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ (Anushka Sharma)  వివాహం స్టార్ క్రికెటర్ Virat Kohli తో జరిగిన విషయం తెలిసిందే. ఇటలీలోని టుస్కానీ నగరంలో గల 800 ఏళ్ల నాటి విల్లాలో ఈ స్టార్ కపుల్ మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. 2017 డిసెంబర్ 11 వీరి వెడ్డింగ్ డేట్. వీరికి కూతురు వామికా కోహ్లీ ఉంది.

Related Articles

46

‘హేట్ స్టోరీ 2’ నటి, బాలీవుడ్ బ్యూటీ సుర్వీన్ చావ్లా (Surveen Chawla)  బిజినెస్ మ్యాన్ అక్షయ్ ఠాకూర్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. 2015లో ఇటలీలో వీరి వివాహం జరిగింది. పెళ్లైన రెండేళ్లకు ఈ ముద్దుగుమ్మ తను మ్యారేజ్ చేసుకున్నట్టు ప్రకటించడం విశేషం. రీసెంట్ గా ‘రానా నాయుడు’  సిరీస్ లో నైనా నాయుడు పాత్రతో అలరించింది. 
 

56

భారతీయ సంపన్నుడు ముఖేష్ అంబానీ కూతురు Isha Ambani పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో తెలిసిందే. ఆనంద్ పిరమాల్ తో ఈమె వివాహం ఎంతో గ్రాండ్ గా జరిగింది. వీరి పెళ్లి ఇండియాలోనే జరిగినా.. ఎంగేజ్ మెంట్ మాత్రం ఇటలీలోని లేక్ కోమోలో నిర్వహించడం విశేషం. ఇలా ఇటలీ ఇండియన్ సెలబ్రెటీల వివాహ వేడుకలకు వేదికగా మారుతోంది. 
 

66

ఇక ఈరోజు లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ వివాహం బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్, ఇటలీలో గ్రాండ్ గా జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, నితిన్, మెగా కుటుంబీకులు, బంధువులంతా ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. నవంబర్ 5న హైదరాబాద్ లో రిసెప్షన్ కు ఏర్పాట్లు చేశారు. 
 

Recommended Photos