Janhvi Kapoor: పెద్ది తర్వాత జాన్వీ కపూర్ కి ఆఫర్స్ లేవా ? అల్లు అర్జున్ సినిమా సంగతేంటి..

Published : Aug 29, 2026, 01:31 PM IST

Janhvi Kapoor: అల్లు అర్జున్‌ రాకాతో పాటు మరో సౌత్‌ సినిమాకు జాన్వీ కపూర్‌ ప్రస్తుతం సైన్‌ చేయలేదని సమాచారం. బలమైన పాత్రల కోసం ఆమె ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.

PREV
15
Janhvi Kapoor

జాన్వీ కపూర్‌ సౌత్‌ ఇండియన్‌ సినిమాల విషయంలో ప్రస్తుతం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం రాకాలో ఆమె నటిస్తున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ భాగస్వామ్యంపై మేకర్స్‌ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు రాకా మినహా ప్రస్తుతం జాన్వీ చేతిలో కొత్త సౌత్‌ సినిమా ఏదీ లేదని పరిశ్రమ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

25
నటనకు ఎక్కువ అవకాశం ఉన్న క్యారెక్టర్లకే ప్రాధాన్యం

జాన్వీ కపూర్‌ ఇకపై భారీ బడ్జెట్‌ సినిమాల్లో కేవలం గ్లామర్‌ హీరోయిన్‌గా కనిపించే పాత్రల కంటే నటనకు ఎక్కువ అవకాశం ఉన్న క్యారెక్టర్లకే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. పాత్రకు ప్రాధాన్యం, కథలో తనకు ఉన్న స్కోప్‌ వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే కొత్త సినిమాలను ఎంపిక చేసుకోవాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పెద్ది సినిమా అనుభవం కూడా ఆమె ఆలోచనా విధానంపై ప్రభావం చూపినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

35
సౌత్‌ సినిమాల విషయంలో మరింత జాగ్రత్త

పెద్దిలో తన పాత్రను తెరకెక్కించిన విధానంపై జాన్వీ కపూర్‌కు కొన్ని అభ్యంతరాలు ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. సినిమా విడుదలైన తర్వాత ఆమె పెద్దగా బయటకు వచ్చి చిత్రాన్ని ప్రమోట్‌ చేయలేదు. మీడియాతో కూడా ఎక్కువగా మాట్లాడకుండా, సినిమాకు సంబంధించిన విషయాలపై బహిరంగంగా చర్చించకుండా ఆమె తక్కువ ప్రొఫైల్‌ మెయింటైన్‌ చేశారు. ఇప్పుడు కొత్త సౌత్‌ సినిమాల విషయంలో కూడా ఇదే కారణంతో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

45
దేవర, పెద్ది సినిమాలతో క్రేజ్

ఇప్పటికే జాన్వీ కపూర్‌ దేవర, పెద్ది సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అయితే వరుసగా సౌత్‌ సినిమాలు చేయాలనే తొందరలో ఆమె లేరని సమాచారం. ముఖ్యంగా తన పాత్రకు తగిన ప్రాధాన్యం ఉన్న సినిమాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. భారీ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించడం కంటే నటిగా తన సామర్థ్యాన్ని చూపించే అవకాశం ఉన్న పాత్రలకు ఆమె ప్రస్తుతం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు పరిశ్రమ వర్గాల సమాచారం.

55
హిందీ ప్రాజెక్టులు

మరోవైపు జాన్వీ కపూర్‌ చేతిలో ప్రస్తుతం కొన్ని హిందీ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిపై దృష్టి పెడుతూ ఆమె ప్రస్తుతం కాస్త నెమ్మదిగా సినిమాలను ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి రాకానే ఆమెకు ఉన్న ఏకైక సౌత్‌ ఇండియన్‌ సినిమా కమిట్‌మెంట్‌గా ప్రచారం జరుగుతోంది. అయితే రాకాలో ఆమె నటిస్తున్న విషయాన్ని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. పూర్తి తారాగణాన్ని వెల్లడించిన తర్వాత ఈ విషయంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories