జాన్వీ కపూర్‌ ముగ్గురు పిల్లల ఫాంటసీ, భర్తకి ఆయిల్‌ మసాజ్‌ చేస్తూ గోవింద నామస్మరణం

Published : Jan 24, 2025, 07:49 PM IST

`దేవర` హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా సౌత్‌లో సెటిల్‌ కావడమే కాదు, ఇప్పుడు లైఫ్‌లోనూ ఇక్కడే సెటిల్‌ అవుతానంటోంది. ముగ్గురు పిల్లల్ని కనాలని ఉందని చెప్పింది.   

PREV
12
జాన్వీ కపూర్‌ ముగ్గురు పిల్లల ఫాంటసీ, భర్తకి ఆయిల్‌ మసాజ్‌ చేస్తూ గోవింద నామస్మరణం

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ సౌత్‌ సినిమా ఇండస్ట్రీలో సెటిల్‌ అవ్వబోతుంది. ఇప్పటికే ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `దేవర` చిత్రంలో నటించింది. ఎన్టీఆర్‌ హీరోగా రూపొందిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు రామ్‌ చరణ్‌తో కలిసి `ఆర్‌సీ16`లో నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. 

ఇదిలా ఉంటే జాన్వీ కపూర్‌కి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో ఇష్టం. ఇష్టదైవంగా కొలుస్తుంది. తరచూ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఆయన ఆశిస్సులు తీసుకుంటుంది. అమ్మ శ్రీదేవి లాగానే తాను కూడా శ్రీవారి సేవలో తరిస్తుంటుంది. అయితే కేవలం ఇలా దర్శించుకోవడమే కాదు, ఇక్కడే సెటిల్‌ అవుతానంటోంది జాన్వీ కపూర్‌. 
 

22
Janhvi Kapoor

తాజాగా తన మనసులో మాట వెల్లడించింది. పెళ్లి చేసుకుని తిరుమలలో సెటిల్‌ అవుతానని చెప్పింది. గోవింద నామాన్ని స్మరించుకుంటూ బతికేస్తానని చెప్పింది. పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లల్ని కనాలనుకుంటుందట. అంతేకాదు ప్రతి రోజు అరటి ఆకుల్లో భోజనం చేయాలని ఉందని చెప్పింది. గోవింద నామ స్మరణం చేసుకుంటూ తన భర్త లుంగీలో ఉంటే ఆయనకు ఆయిల్‌ మసాజ్‌ చేస్తూ, రొమాంటిక్‌ జీవితాన్ని గడపాలనుకుంటున్నట్టు తెలిపింది జాన్వీ కపూర్‌. 

ఇలా తన మనసులో మాటని బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే జాన్వీ కపూర్‌ ప్రస్తుతం ప్రేమలో ఉందట. ఆమె ఓ వ్యాపారవేత్త కొడుకు శిఖర్‌ పహారియాతో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఇద్దరు కలిసి చాలా సందర్భాల్లో మీడియాకి దొరికిపోయారు. ఆ మధ్య కలిసే తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య లవ్‌ ట్రాక్‌ ఘాఢంగా నడుస్తుందని తెలుస్తుంది. దీంతో జాన్వీ కపూర్‌ మనసులో కోరిక ఉంది, పెళ్లి చేసుకోవడానికి ప్రియుడు ఉన్నాడు, ఇక మ్యారేజ్‌ చేసుకుని పిల్లలను కనడమే ఆలస్యం, తిరుమలలో సెటిల్‌ కావడమే ఆలస్యం అంటున్నారు నెటిజన్లు. 

కెరీర్‌ పరంగా చూస్తే జాన్వీ పూర్‌ గతేడాది ఎన్టీఆర్‌తో `దేవర` చిత్రంలో నటించింది. ఈ మూవీ విశేష ఆదరణ పొందింది. దీనికి పార్ట్ 2 `దేవర 2` కూడా ఉంది. త్వరలోనే ఇది ప్రారంభం కాబోతుంది. దీనికి కొరటాల శివ దర్శకుడు. దీంతోపాటు రామ్‌ చరణ్‌తో కలిసి `ఆర్‌సీ16`లో నటిస్తుంది. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఈ నెల 27 నుంచి కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కానుందట. 

read more: `స్పిరిట్‌` స్టోరీ బ్యాక్‌ డ్రాప్‌ లీక్‌.. ప్రభాస్‌ చేయబోయే ఫైట్‌ దానిపైనే ?

also read: ఎనర్జీ సీక్రెట్ ను బయటపెట్టిన జాన్వీ కపూర్, ఫేవరెట్ డ్రింక్ పై లెక్చర్ కూడా ఇస్తోంది.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories