`స్పిరిట్‌` స్టోరీ బ్యాక్‌ డ్రాప్‌ లీక్‌.. ప్రభాస్‌ చేయబోయే ఫైట్‌ దానిపైనే ?

Published : Jan 24, 2025, 06:48 PM IST

ప్రభాస్‌ ప్రస్తుతం `ది రాజాసాబ్`, `ఫౌజీ` చిత్రాలు చేస్తున్నారు. త్వరలో మరో సినిమా `స్పిరిట్‌` ని ప్రారంభించే ప్లాన్‌ లో ఉన్నారు. దీనికి సంబంధించిన క్రేజీ అప్‌ డేట్‌ బయటకు వచ్చింది.   

PREV
12
`స్పిరిట్‌` స్టోరీ బ్యాక్‌ డ్రాప్‌ లీక్‌.. ప్రభాస్‌ చేయబోయే ఫైట్‌ దానిపైనే ?

ప్రభాస్‌ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన ఇప్పుడు ఓ వైపు మారుతి దర్శకత్వంలో `ది రాజా సాబ్‌`, మరో వైపు హను రాఘవపూడితో సినిమా `ఫౌజీ` చిత్రాలు చేస్తున్నారు. ఈ సినిమాల షూటింగ్‌లే పూర్తి కాలేదు. ఇప్పుడు మరో మూవీని స్టార్ట్ చేయబోతున్నారు. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ విషయం బయటకు వచ్చింది. 

త్వరలోనే `స్పిరిట్‌` మూవీ ప్రారంభం కాబోతుందట. దీనికి సంబంధించిన లొకేషన్‌ అన్వేషణ చేయబోతున్నారు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. జకర్తా, ఇండోనేషియాలో మొదటి షెడ్యూల్‌ని ప్రారంభించాలని ప్లాన్‌ చేయబోతున్నారట. త్వరలోనే సందీప్‌ రెడ్డి వంగా తన ఆర్ట్ డైరెక్టర్ తో కలిసి జకర్తా వెళ్లబోతున్నట్టు తెలుస్తుంది. 
 

22

ఇదే కాదు మరో ఇంట్రెస్టింగ్‌ విషయం బయటకు వచ్చింది. ఇందులో ప్రభాస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తారని అంటున్నారు. ఆయన పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తారట. అయితే ఆయన పాత్రలో కొంత నెగటివ్‌ షేడ్‌ ఉంటుందని, ఆ తర్వాత పాజిటివ్‌గా టర్న్ తీసుకుంటుందని తెలుస్తుంది. ఇదే కాదు, ఈ మూవీ బ్యాక్‌ డ్రాప్‌ ఇప్పుడూ గూస్‌ బంమ్స్ తెప్పిస్తుంది. డ్రగ్స్ మాఫియా చుట్టూ ఈ కథ నడుస్తుందని తెలుస్తుంది. 

ఇంటర్నేషనల్‌ డ్రగ్స్ మాఫియా గురించి ఇందులో చర్చించబోతున్నారని, పోలీస్‌ ఆఫీసర్‌గా ప్రభాస్‌ ఈ డ్రగ్స్ మాఫియాపై పోరాడుతాడని తెలుస్తుంది. అందుకోసమే ఈ మూవీని గ్లోబల్‌ మార్కెట్‌ని టార్గెట్‌గా చేస్తూ రూపొందిస్తున్నారట. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఈ వార్త మాత్రం ప్రభాస్‌ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుందని చెప్పొచ్చు. 

ఇదిలా ఉంటే ఇందులో నెగటివ్‌ రోల్‌లో వరుణ్‌ తేజ్‌ నటిస్తారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ప్రభాస్‌తో తలపడే పాత్ర కోసం వరుణ్‌ తేజ్‌ని అడిగారని, ఆయన ఓకే చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇందులో నిజం లేదని, ఇవన్నీ ఫేక్‌ న్యూస్‌ అని వరుణ్‌ తేజ్‌ టీమ్‌ తెలిపింది. ఇక ఇందులో అనుష్క శెట్టిని హీరోయిన్‌గా తీసుకోవాలనుకుంటున్నారట. 

read  more:`రామాయణం` యానిమేషన్‌ మూవీ రివ్యూ.. జపాన్‌ వాళ్లు మన రామాయణాన్ని ఎలా తీశారంటే?

also read: `హత్య` మూవీ రివ్యూ.. వివేకానంద రెడ్డిని హత్య చేసింది సొంత కూతురా? జగనా?
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories