సోషల్ మీడియా ద్వారా సినిమా తారల ఎంత ఫేమస్ అవుతారో.. అంతే ఇబ్బందులు కూడా పడతారు. వారు పెట్టే పోస్టులు ఎంత వైరల్ అవుతాయో.. వారికి వచ్చే కామెంట్లు కూడా అంతే ఇబ్బందికరంగా.. అనుచితంగా ఉంటాయి. అలా అని అన్ని నెగెటీవ్ కామెట్లు మాత్రం రావు. కాని లైక్ లు, కామెంట్స్, వాటి నుంచి వచ్చే ఫాలోయింగ్. డబ్బులు, ఫేమ్, అవకాశాల కోసం చాలా మంది ఇవన్నీ భరిస్తుంటారు. అయితే అవి మితిమీరి మార్ఫింగ్ చేసిన ఫోటోలు అశ్లీల సైట్లలో పోస్టు చేయడం వరకు రకరకాలుగా వేధింపులకు గురవ్వడం వరకూ వెళ్తుంటాయి.