మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన జాన్వీ కపూర్... మొక్కు తీర్చుకున్న స్టార్ హీరోయిన్..

Published : Mar 22, 2024, 11:26 AM IST

ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పింది హీరోయిన్ జాన్వీ కపూర్. జాన్వీకి అసలే ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. అటువంటిది.. ఆమె అందులో కూడా సాహసాలు చేస్తూ.. దైవదర్శనాలు చేసుకుంటుంది. 

PREV
17
మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన జాన్వీ కపూర్... మొక్కు తీర్చుకున్న స్టార్ హీరోయిన్..
Janhvi Kapoor

బాలీవుడ్ బ్యూటీ.. జూనియర్ అతిలోక సుంద‌రిగా పేరు తెచ్చుకుంది జాన్వీ కపూర్.  దివంగత స్టార్ హీరోయిన్  శ్రీదేవి పెద్ద కూతురుగా ఇండస్ట్రీలోకి ఆరంగేట్రం చేసింది బ్యూటీ. అయితే జాన్వీ బాలీవుడ్ లో డిఫరెంట్ జానర్ లో సినిమాలు చేస్తూ వస్తోంది. కమర్షియల్ సినిమాలకంటే ఎక్కువగా ఆర్ట్ మూవీస్ ను చేస్తోంది బ్యూటీ ఇక ప్రస్తుతం సౌత్ ఎంట్రీ ఇస్తోన్న ఈ చిన్నది.. తెలుగులో రెండు కమర్షియల్ సినిమాలకు కమిట్ అయ్యింది. 

27

ఆర్ఆర్ఆర్ హీరోలయిన ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో చెరో సినిమా చేస్తోంది బ్యూటీ. ఎన్టీఆర్ తో జోడీగా కొరటాల దర్శకత్వంలో దేవర సినిమా చేస్తోంది జాన్వీ. ఈసినిమాతోనే ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుండగా.. ఈ మూవీ షూటింగ్ కూడా దాదాపు అయిపోవచ్చింది. ఇక రామ్ చరణ్ తో బుచ్చిబాబు చేస్తోన్న పాన్ ఇండియా మూవీల్ కూడా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా ఈమూవీ షూటింగ్ లాంచనంగా స్టార్ట్ అయ్యింది. 
 

37

ఇక జాన్వీ కపూర్ కు సినిమాలు, సోషల్ మీడియాలో గ్లామర్ పిక్స్ తో హడావిడి చేయడమే కాదు.. ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే.  జాన్వీ క‌పూర్ త‌ర‌చూ ద‌ర్శ‌నం కోసం పుణ్య క్షేత్రాలు తిరుగుతుంటుంది.  అందులోనే తిరుమ‌ల తిరుపతి వెంకటేశ్వరునికి ఆమె పరపభక్తురాలు. ఎక్కువగా తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శనం చేసుకుంటుంటుంది జాన్వీ కపూర్. 

47
Janhvi Kapoor Shikhar Pahadia

ఇక జాన్వీ తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి ఎక్కువ‌గా తిరుమలకు వస్తుంటార‌నే విష‌యం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె ఈ నెల 6న కూడా జాన్వీ త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా స్నేహితుల‌తో క‌లిసి స్వామి వారిని ద‌ర్శించుకుంది. శిఖ‌ర్ ప‌హారియా, ఒరీతో క‌లిసి వెంక‌టేశ్వ‌ర స్వామి వారి సేవ‌లో పాల్గొన్నారు. 
 

57

ఇలా స్వామి వారి సేవ‌లో పాల్గొన్న స‌మ‌యంలో తీసిన ఓ వీడియోను ఒరీ తాజాగా సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. తిరుమ‌ల యాత్ర ఎలా జ‌రిగిందో అందులో వివ‌రించిందామె. చెన్నైలోని జాన్వీ క‌పూర్ ఇంటి నుంచి కారులో మూడు గంట‌ల ప్ర‌యాణం త‌ర్వాత తిరుమ‌ల చేరుకున్న‌ట్లు ఆమె పేర్కొంది. ఆ త‌ర్వాత జాన్వీ బంధువుల‌తో క‌లిసి న‌డ‌క దారిన తిరుమ‌ల చేరుకున్నామ‌ని ఆమె అన్నారు. 
 

67

ఇక మరో విశేశం ఏంటంటే.. మోకాళ్ల మిట్ట వ‌ద్ద జాన్వీ-శిఖ‌ర్ మోకాళ్ల‌పై మెట్లెక్కారు. మోకాళ్ళపై తిరుమల చేరుకుని.. ఆమె దేవుని దర్శనం చేసుకున్నారు.  దాదాపు 50సార్లు తానుకు ఇక్క‌డికి వ‌చ్చిన‌ట్లు..తిరుమల అంటే అంటే త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని కూడా ఆమె చెప్పుకొచ్చింది.

77
Janhvi Kapoor

ఇక రీసెంట్ గా RC16 ఓపెనింగ్ జరగ్గా.. జాన్వీ త‌న తండ్రి బోనీ క‌పూర్‌తో క‌లిసి చెర్రీ నివాసానికి వెళ్లింది. అక్క‌డ ద‌ర్శ‌కుడు బుచ్చిబాబుతో పాటు ఇత‌ర చిత్ర‌యూనిట్‌తో క‌లిసి కొద్దిసేపు స‌ర‌దాగా గ‌డిపారు. దీనికి సంబంధించిన ఫొటోల‌ను జాన్వీక‌పూర్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది.

Read more Photos on
click me!

Recommended Stories