ఓ సందర్భంలో పిల్లలే అన్నారట. పవన్ మరో పెళ్లి చేసుకున్నప్పుడు. మమ్మీ నువ్వెందుకు సింగిల్‌గానే ఉంటున్నావు, నువ్వు కూడా పెళ్లి చేసుకోవచ్చు కదా అని అకీరా నందన్ అడిగాడట. దానికి రేణు స్పందిస్తూ, చేసుకుంటా బాబు, అబ్బాయి దొరకాలి కదా అని చెప్పింది. అయితే పవన్, తాను విడిపోయిన విషయం పవన్‌తో వాళ్లు ఎప్పుడూ అడగరట. అకీరా, ఆద్య చాలా మెచ్యూర్డ్ గా ఉంటారు, చిన్నపిల్లల్లా అనిపించరు.