Guppedantha manasu 22nd march Episode:ఫణీంద్రలో అనుమానం, హాస్పిటల్ లో మొదలైన బావ మరదళ్ల ప్రేమ..!

First Published Mar 22, 2024, 8:48 AM IST

దేవయాణి ఏమీ తెలియనట్లుగా ముఖం పెట్టడంతో.. ఇంకా కొద్దిరోజులే అత్తయ్యగారు..త్వరలోనే మీ పాపాలన్నీ బయటపడతాయి అని ధరణి మనసులో అనుకుంటుంది.
 

Guppedantha Manasu


Guppedantha manasu 22nd march Episode: ఫణీంద్ర.. అనుపమ కండిషన్ తెలుసుకోవడానికి మహేంద్రకు ఫోన్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. మధ్యలో దేవయాణి ఫోన్ తీసుకుంటుంది. అనుమపకు ఇప్పుడు ఎలా ఉంది? జ్యూస్ తాగిందా? మాట్లాడగలుగుతోందా? నేను అక్కడికి రానా అని చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మహేంద్ర తిప్పలుపడతాడు. అసలు అనుపమ గురించి మీరు ఎందుకు అంత కేర్ తీసుకుంటున్నారు వదినగారు అని అడుగుతాడు. దానికి అయ్యో అనుపమ నీకు బెస్ట్ ఫ్రెండ్, నీకు జగతికి పెళ్లి చేసింది కూడా తనే కదా  ఆ మాత్రం కేర్ చూపించకపోతే ఎలా అని అంటుంది. అవసరం లేదని.. తాము చూసుకుంటామని మహేంద్ర ఫోన్ పెట్టేస్తాడు.

Guppedantha Manasu

మహేంద్ర ఫోన్ పెట్టేయడంతో దేవయాణికి కోపం వస్తుంది. చూశారా..? అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా సరిగా చెప్పడం లేదు అని అంటుంది. దానికి ఫణీంద్ర.. తన తమ్ముడిని సపోర్ట్ చేస్తాడు. నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో ఎవరికీ తెలీదు.. నాకే నువ్వు అర్థంకావు.. ఇంక మహేంద్రకు ఏమి అర్థం అవుతావ్.. అని చివాట్లు పెడతాడు.

తర్వాత తమ ఫ్యామిలీలో జరిగిన అన్ని సంఘటనలు ఫనీంద్రకు గుర్తుకువస్తాయి. రిషి కాలేజీ వదిలేసి వెళ్లేలా చేయడం, కాలేజీ దక్కించుకోవడానికి ఎవరెవరో రావడం, రిషి పై ఎటాక్ చేస్తుంటే.. జగతి అడ్డు వచ్చి ప్రాణాలు కోల్పోవడం.. ఇప్పుడు మను పై ఎటాక్ కి అనుపమ బలికావడం.. అన్నీ గుర్తుకువస్తాయి. మన శత్రువులు ఎవరు శైలేంద్ర అని అడుగుతాడు. తల్లీ, కొడుకులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. అడిగేది మిమ్మల్నే.. ఇద్దరు ముఖాలు చూసుకుంటారేంటి? మన శత్రువు ఎవరో మీకు తెలుసా అని ఫణీంద్ర అడుగుతాడు. లేదు అని ఇద్దరూ చెబుతారు. అయితే.. రిషి ఆచూకీ ఎలాగూ కనిపెట్టలేకపోయావ్? కనీసం మన శత్రువు ఎవరో అయినా కనిపెట్టమని, కాలేజీకి వెళ్లి నువ్వు చేసేది ఏమీ లేదు కదా.. ఇదైనా చెయ్యమని శైలేంద్ర కు  ఫణీంద్ర చెబుతాడు. సరే డాడీ అని శైలేంద్ర అంటాడు. అయితే... దేవయాణి ఏమీ తెలియనట్లుగా ముఖం పెట్టడంతో.. ఇంకా కొద్దిరోజులే అత్తయ్యగారు..త్వరలోనే మీ పాపాలన్నీ బయటపడతాయి అని ధరణి మనసులో అనుకుంటుంది.

Guppedantha Manasu


సీన్ కట్ చేస్తే.... మను హాస్పిటల్ లో  డల్ గా కూర్చొని ఉంటాడు. అప్పుడే వసుధార, ఏంజెల్ వచ్చి ఫుడ్ ఇస్తారు. తనకు ఆకలిగా లేదని మను అంటాడు. కానీ.. వసు, ఏంజెల్ వదిలిపెట్టరు. తినాల్సిందే అని పట్టుపడతారు. తాను చాలాసార్లు కనీసం భోజనం చేయకుండా ఉన్నాను అని మను అంటే.. అత్తయ్య పక్కనుంటే నిన్ను అలా వదిలిపెట్టేది కాదు కదా అని ఏంజెల్ అంటుంది. ఆమెను నేను దూరం అయ్యాను అని.. ఒంటిరి వాడిని అని చెబుతాడు. అయితే.. అప్పుడు అమ్మలేని తనకు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో బాగా తెలుసు అని గొప్పగా చెబుతుంది.

Guppedantha Manasu

తర్వాత.. నువ్వు తినను అంటే నేనే తినిపిస్తాను అనే సరికి.. తప్పక మను ఆ ఫుడ్ తీసుకుంటాడు. ఆ ఫుడ్ తింటూ ఉంటే.. మూతికి అంటుంది. ఆ విషయం ఏంజెల్ చూసి చెబుతుంది. మను తుడుచుకుంటాడు. ఈలోగా మనుకి పొలమారుతుంది. మంచినీళ్ల కోసం ఏంజెల్ కంగారుపడుతుంటే.. తానే తెస్తాను అని వసుధార వెళ్తుంది. వసుధార వాటర్ తెచ్చేలోగా.. ఏంజెల్.. మనుకి వాటర్ తాగిస్తుంది. ఆ సమయంలో వెనక బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. త్వరలో వారి మధ్య ప్రేమ చిగురించడం ఖాయం అన్నట్లుగా చూపించడం విశేషం.

Guppedantha Manasu

తర్వాత.. మహేంద్ర హాస్పిటల్ లో డాక్టర్ తో మాట్లాడటానికి వెళతారు.వెనకాలే వీళ్లు కూడా వెళతారు. రేపు డిశ్చార్జ్ చేస్తాం అని డాక్టర్లు చెబుతారు. ఇక.. మా ఇంటికి మా అత్తయ్యను తీసుకొని వెళతాను అని ఏంజెల్ అంటే.. మా ఇంటికే తీసుకువెళతాను అని మహేంద్ర అంటాడు. ఇద్దరూ కాసేపు మా ఇంటికి అంటే మా ఇంటికి అని వాదించుకుంటారు. అయితే....  నిర్ణయాన్ని మనుకి వదిలేద్దాం అని వసుధార అంటుంది. అయితే.. మను ఆవిడ నా మాట వినదు అని..ఎవరు చెప్పినా వినదని.. ఆమెకు నచ్చిన పని చేస్తుందని మను అంటాడు. చివరకు మహేంద్ర మా ఇంటికే తీసుకువెళ్తానని.. ఏంజెల్ ని కూడా అక్కడికే రమ్మని చెబుతాడు. సరే అని అంటుంది.

Guppedantha Manasu

ఇక.. శైలేంద్ర ఫ్రస్టేట్ అవుతూ ఉంటాడు. దేవయాణి కాఫీ తెచ్చి ఇస్తుంది. ఇప్పుడు కాఫీ ఏంటి మమ్మీ అని శైలేంద్ర అంటే.. జ్యూస్ తేనా అని అడుగుతుంది. అయితే.. అది కాదని.. మన పరిస్థితి ఏమీ బాలేదని.. ఏది అనుకున్నా జరగడం లేదని తెగ ఫీలౌపోతాడు. అప్పుడు.. దేవయాణి ధైర్యం చెబుతుంది. మనం అనుకున్నది జరగడానికి కొన్నిసార్లు సమయం పడుతుందని..  కానీ జరుగుతాయి అని చెబుతుంది. తర్వాత.. ఆ అనుపమ భర్త ఎవరు..? మను తండ్రి ఎవరు అనే విషయం తెలుసుకుంటే, ఆ రహస్యం కనిపెడితే.. మనం వాళ్లను ఒక ఆట ఆడుకోవచ్చని చెబుతుంది. దానికి.. శైలేంద్ర సరే అని.. కచ్చితంగా ఆ విషయాలు తెలుసుకుంటాను అని  శైలేంద్ర అంటాడు. ఆ మనుగాడిని ఓ ఆాట ఆడుకుంటాను అని చెబుతాడు.

Guppedantha Manasu

సీన్ కట్ చేస్తే.. అనుపమను డిశ్చార్జ్ చేస్తారు. తీసుకొని వస్తుంటే.. అనుపమ పడిపోతూ ఉంటే.. మను పట్టుకుంటాడు ఆ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఇక.. లోపలికి తీసుకువచ్చిన తర్వాత.. ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు..? మా ఇంటికి వెళ్లేదాన్ని కదా అని అనుపమ అంటుంది. అలా ఎలా వదిలేస్తాం అని మహేంద్ర అంటే.. 25ఏళ్లుగా నేను ఒంటరిదాన్నే కదా అంటుంది. తర్వాత.. నీ  ట్యాబ్లెట్స్ కి టైమ్ అయ్యింది అని మహేంద్ర అంటే.. ట్యాబ్లెట్స్ కారులో ఉన్నాయి అని ఏంజెల్ తేవడానికి వెళ్తుంది. కానీ వసుధార ఆపుతుంది. అక్కడితో  ఎపిసోడ్ ముగుస్తుంది.

click me!