Janhvi kapoor Blasting: సౌదీ అరేబియాలో రెచ్చిపోయిన జాన్వీ.. ఓపెన్‌గా సిగ్నల్స్ ఇస్తుందా?

Published : Dec 17, 2021, 07:39 PM IST

అతిలోక సుందరి ముద్దుల కూతురు జాన్వీ కపూర్‌ యూత్‌కి డ్రీమ్‌ గర్ల్. గ్లామర్‌ షోతో ఇంటర్నెట్‌లో ఫాలోయింగ్‌ని పెంచుకుంటున్న ఈ అందాల సోయగం వెకేషన్‌లో బిజీగా ఉంది. బ్రేకులు లేకుండా గ్లామర్‌ విందుని వడ్డిస్తుంది. స్వేచ్ఛాగాలులు పీల్చుతూ రెచ్చిపోయింది. 

PREV
19
Janhvi kapoor Blasting: సౌదీ అరేబియాలో రెచ్చిపోయిన జాన్వీ.. ఓపెన్‌గా సిగ్నల్స్ ఇస్తుందా?

జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌ లో సంచలనంగా మారింది. సినిమాలతో పోల్చితే సోషల్‌ మీడియాలోనే బిజీగా ఉండే ఈ భామ మరోసారి కుర్రాళ్లకి ట్రీట్‌నిచ్చింది. ఆమె ఫాలోవర్స్ కి బ్యాక్‌ టూ బ్యాక్‌ విందునిస్తూ కనువిందు చేస్తుంది. జాన్వీ కపూర్ ప్రస్తుతం వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. ప్రస్తుతం ఆమె సౌదీ అరేబియాలో హాలీడేస్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. అందులో భాగంగా ఇసుక తిన్నెలు, చారిత్రాత్మక ఏడారుల్లో ఫోటోలకు పోజులిస్తుంది. 

29

సౌదీ అరేబియాలో దిగిన ఫోటోలను షేర్‌ చేసుకుంటూ కనువిందు చేస్తుంది జాన్వీ. వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా అవి ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంది. అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. చూపుతిప్పుకోవడం లేదు. క్లోజ్‌డ్‌గా ఆమె ఇచ్చిన పోజులు కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయంటే అతివయోక్తి కాదు. అంతేకాదు రాక్స్ పై పడుకుని దిగిన పిక్స్ పిచ్చెక్కిస్తున్నాయి. మొత్తంగా జాన్వీ ఇంటర్నెట్‌లో బ్లాస్టింగ్‌ పెట్టింది. 

39

వీటిపై నెటిజన్లు హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. ఆ పరువాలు తట్టుకోవడం కష్టమే అని, ఏంటి ఓపెన్‌గా అలా సిగ్నల్స్ ఇస్తుందేంటి అంటూ పోస్ట్ లు పెడుతుండటం గమనార్హం. మొత్తంగా జాన్వీ అందాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

49

జాన్వీ కపూర్‌కి సామాజిక మాధ్యమాల్లో క్రేజ్‌ మామూలుగా లేదు. ఆమె రెగ్యూలర్‌గా తన హాట్‌ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది.వారికి కావాల్సిన పిక్స్ ని అందిస్తూ కనువిందు చేస్తుంది. దీంతో జాన్వీని ఫాలో అయ్యేవారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. 

59

జాన్వీ అభిమానులకే ప్రత్యేకంగా అందాలు ఆరబోస్తూ ఫోటోషూట్లు నిర్వహిస్తుంది. వాటిని సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటూ వారిని ఎంటర్‌టైన్‌ చేస్తుంది.నిత్యం ఎంగేజ్‌ చేసుకుంటుంది. ఇలా భారీ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ప్రస్తుతం జాన్వీకి ఇన్‌స్టాలో దాదాపు 15 మిలియన్స్ నెటిజన్లు ఫాలో అవుతుండటం విశేషం. 
 

69

సోషల్‌ మీడియాలోకి వచ్చిన అతితక్కువ సమయంలోనే భారీ ఫాలోయింగ్‌ని దక్కించుకుంది. మరోవైపు సినిమాల పరంగానూ దూసుకుపోతుంది జాన్వీ. నెమ్మదిగా, చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ కెరీర్‌ని సరైన ట్రాక్‌లో పెట్టుకుంటుంది. తన తండ్రి బోనీ కపూర్‌ సారథ్యంలో, మెంటర్‌ కరణ్‌ జోహార్‌ ప్లానింగ్‌తో ముందుకు సాగుతుంది. 
 

79

తల్లి శ్రీదేవి వారసత్వాన్ని అందిపుచ్చుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ. `దడఖ్‌` చిత్రంతో హీరోయిన్‌గా బాలీవుడ్‌కి పరిచయమైంది జాన్వీ కపూర్. అయితే తన సినిమాని చూడకముందే తల్లి శ్రీదేవి వెళ్లిపోయింది. దుబాయ్‌లో అనుమానస్పద స్థితిలో కన్నుమూశారు. 
 

89

దీంతో ఆ లోటు జాన్వీలో చాలా ఉందని చెప్పొచ్చు. తల్లి మరణంతో కుంగిపోయిన ఈ బ్యూటీ.. నెమ్మదిగా కోలుకుంది. ఇక గ్లామర్‌ షోకి తెరలేపింది. వరుస ఫోటో షూట్లతో, చాటింగ్‌లతో అభిమానులకు తగ్గరవుతూ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. మరోవైపు సినిమాల పరంగానూ బిజీగా ఉంటోంది. 

99

`ఘోస్ట్ స్టోరీస్‌`, `ఆంగ్రేజి మీడియం`, `గుంజనా సక్సేనా`, `రూహి` చిత్రాల్లో నటించి మెప్పించింది.ఇప్పుడు  `దోస్తానా 2`, `గుడ్‌ లక్ జెర్రీ`, `మిలి` సినిమాల్లో నటిస్తుంది జాన్వీ. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories