Amala Paul's Mother Birthday : పుట్టిన రోజున తల్లిని బుజ్జగిస్తున్న అమలా పాల్.. మై బేబీ అంటూ బర్త్ డే విషెస్

First Published | Mar 6, 2022, 3:31 PM IST

మలయాళ బ్యూటీ అమలాపాల్ (Amala Paul) ఈ రోజు ఎంతో సంతోషంగా ఉంది. తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా అమ్మను లాలిస్తూ వీకెండ్ ఇంట్లోనే గడుపుతోంది. తన తల్లికి బర్త్ డే విషేస్ తెలుపుతూ పలు ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 
 

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అమలా పాల్ తన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా.. ఏదో టైంలో తన ఫ్యాన్స్ తో ఇన్ స్టాలో టచ్ లోనే ఉంటుంది. ప్రతి వీకెండ్, స్పెషల్ డేస్ లో ఫొటోషూట్లతో నెటిజన్లు ఆకట్టుకుంటోంది. 

అయితే ఈ వీకెండ్ మాత్రం అమలాపాల్ ఇంట్లో గడిపింది. తన తల్లి అన్నీస్ పాల్ పుట్టిన రోజు  సందర్భంగా ఇంట్లోనే తల్లికి సేవలు చేస్తుంది. తన తల్లిని బుజ్జగిస్తూ.. లాలిస్తూ సంతోషపెడుతోంది. 
 


ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసి తన అభిమానులతో పంచుకుంది అమలా పాల్. ఈ ఫొటోల్లో అమలాపాల్ తన తల్లిని బుజ్జగిస్తోంది. ఇద్దరు క్యాజువల్ డ్రెస్ లో ఉన్నారు. అన్నీస్ పాల్ గాగుల్స్ ధరించి కూతురు ప్రేమను అనుభూతి చెందుతోంది. 
 

తల్లి గదవ పట్టుకొని ‘నా రాణి, నా చిన్నారి’ అంటూ లాలించింది. ఈ ఫొటోలను షేర్ చేస్తూ క్యాప్షన్ ఇచ్చింది. ‘నా రాణి.. నా బేబీ..  నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ’ అంటూ విషెస్ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  
 

కేరళకు చెందిన అమలా పాల్ 1991లో  పాల్ వర్గీస్, అన్నీస్ పాల్ దంపతులకు జన్మించింది. అమపాల్ కు అమ్మనాన్నతో పాటు సోదరుడు అబిజిత్ పాల్ కూడా ఉన్నారు. ఈయన కూడా సినీ  రంగం ప్రవేశం చేసి ఉన్నాడు. అయితే 2017లో పాల్ వర్గీస్ మరణించాడు. అప్పటి నుంచి అమలా పాల్ తల్లితోనే ఉంటోంది. 
 

కేరీర్ విషయానికొస్తే.. అమలాపాల్ తెలుగు ఆడియెన్స్ కు ‘బెడవాడ’ మూవీతో పరిచయం అయ్యింది.లవ్ ఫెల్యూర్, నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజు వంటి చిత్రాల్లో నటించింది. కానీ రామ్ చరణ్ (Ram Charan) మూవీ  నాయక్,  అల్లు అర్జున్ (Allu Arjun) మూవీ ఇద్దరమ్మాయిలు  సినిమాలతో మంచి గుర్తింపు పొందింది.  చివరిగా ‘పిట్ట కథలు’ అనే ఫిల్మ్ లో బోల్డ్ రోల్ చేసి అందరినీ షాక్ కు గురిచేసింది.  ప్రస్తుతం తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

Latest Videos

click me!