Janaki Kalaganaledu: మల్లికకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన జానకి.. దొంగ ఏడుపులు ఏడుస్తున్న అఖిల్..?

Published : Nov 14, 2022, 12:07 PM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు నవంబర్ 14 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Janaki Kalaganaledu: మల్లికకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన జానకి.. దొంగ ఏడుపులు ఏడుస్తున్న అఖిల్..?

ఈ రోజు ఎపిసోడ్ లో అఖిల్ జ్ఞానాంబ ముందు దొంగ ప్రేమలు నటిస్తూ అమ్మ నీ మీద నా భయంతో తెలిసి తెలియక కొన్ని తప్పులు చేశాను కానీ నువ్వు తలదించుకునే పని ఎప్పటికీ చేయను అమ్మ అంటూ జ్ఞానాంబ మరింత నమ్మిస్తూ ఉంటాడు అఖిల్. అప్పుడు అఖిల్ మాటలు విన్న జ్ఞానాంబ వాళ్ళు నిజమని నమ్ముతూ మరింత బాధపడుతూ ఉంటారు. అప్పుడు అఖిల్ నాటకాలు ఆడుతూ ఒక ఆడపిల్లను చంపాలి అనుకున్నంత దుర్మార్గున్ని కానమ్మా నేను అని అంటూ ఉంటాడు.

26

 అప్పుడు రామచంద్ర అఖిల్ నువ్వేం భయపడకు అఖిల్ లాయర్ గారితో మాట్లాడి నేను నీకు బెయిల్ ఇప్పిస్తాను అని అంటాడు. పెద్ద వదిన నా మీద ఏదో కక్షతో ఇలా నామీద పగ తీర్చుకుంటుంది అన్నయ్య అంటూ జానకి మీద లేనిపోని మాటలు అన్ని చెబుతూ ఉంటాడు అఖిల్. అప్పుడు అఖిల్ మాటలు నిజం అని నమ్మిన జ్ఞానాంబ ఎందుకు రామ జానకి ఇలా ప్రవర్తిస్తుంది అని అంటుంది. మరొకవైపు జానకి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి మల్లిక  వస్తుంది.
 

36

అప్పుడు మల్లిక ఇంటి పెద్ద కోడలుగా నీ స్థానాన్ని అడ్డుపెట్టుకొని రెచ్చిపోయావు జానకి అంటూ మల్లికా నోటికి వచ్చిన విధంగా వాగుతూ జానకి ని మరింత బాధపెడుతూ ఉంటుంది. ఆకాశం దొరికితే చాలు నా సంతోషంతో కబడ్డీ ఫుట్బాల్ ఆడుకున్నావు కదా జానకి ఈరోజు బావగారి దృష్టిలో నువ్వు చెడ్డ అయ్యావు అత్తయ్య గారి దృష్టిలో కూడా నువ్వంతట నువ్వే చెడ్డ అయ్యావు అంటూ మల్లికఅవకాశం దొరికింది కదా అని జానకిని మాటలతో దెప్పిపొడుస్తూ ఉంటుంది. అప్పుడు జానకి నీ స్పోర్ట్స్ భాషలో అర్థం అయ్యేటట్టు చెబుతాను విను మల్లిక.
 

46

 నీ ఫేక్ ప్రెగ్నెన్సీ గురించి బయట పెడదాము అనుకుంటే ఇంతలోనే అఖిల్ విషయం అడ్డు వచ్చింది. అది పరిష్కారం కాగానే నెక్స్ట్ లైన్ లో నువ్వే. ఈసారి నేను నిన్ను కొట్టేది సిక్స్. కొడితే స్టేడియం అవతల పడతావు అని దానికి వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడు మల్లిక వెటకారంగా మాట్లాడుతూ ఉండగా తొందర్లోనే నీ బండారం మొత్తం బయట పెడతాను మల్లిక అని అంటుంది జానకి. మరోవైపు అఖిల్ దొంగ ఏడుపులు ఏడుస్తూ జ్ఞానాంబ వాళ్ళను మరింత నమ్మిస్తూ ఉంటాడు.
 

56

 అప్పుడు రామ అఖిల్ సరే మేము వెళ్లొస్తాము లాయర్ గారిని పిలుచుకుని వచ్చి నిన్ను బెయిల్ పై బయటికి తీసుకు వస్తాము అని జ్ఞానాంబ వాళ్ళు అక్కడి నుంచి వెళ్తూ ఉండగా అఖిల్ దొంగ ఏడుస్తూ అమ్మ వెళ్లొద్దు అని అంటూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి సునంద వస్తుంది. అప్పుడు సునంద కావాలని జ్ఞానాంబని దెప్పిపొడుస్తూ వెటకారంగా మాట్లాడిస్తూ ఉంటుంది. అప్పుడు కావాలనే ఆమె వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత లోపలికి వెళ్లిన సునంద అఖిల్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది.
 

66

అప్పుడు సునంద ఎట్టి పరిస్థితులలోను అఖిల్ ఈ కేసు నుంచి బయటపడడానికి వీల్లేదు. మీరు చేయాల్సింది మీరు చేయండి నేను చేయాల్సింది నేను చేస్తాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు మల్లిక జానకి అన్న మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు మల్లిక జెస్సీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పడంతో వాళ్ళు షాక్ అవుతారు. అప్పుడు జానకి మీద మల్లిక లేనిపోని మాటలు అన్నీ చెప్పి జెస్సి తల్లిదండ్రులను మరింత రెచ్చగొడుతుంది. మరొకవైపు అఖిల్ గురించి మాట్లాడడానికి రామచంద్ర లాయర్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు లాయర్ అడగడంతో రామ జరిగింది మొత్తం వివరిస్తాడు.

click me!

Recommended Stories