ఈరోజు ఎపిసోడ్ లో పరంధామయ్య అక్కడినుంచి వెళ్ళిపోతూ ఉండగా మళ్లీ ఎక్కడికి వెళ్తున్నారు అని అనసూయ అడగడంతో అడిగే హక్కు ఎప్పుడో కోల్పోయావు అని అంటాడు. అప్పుడు అనసూయ తన తాలిని చూపించి ఈ తాళి మెడలో ఉన్నంతవరకు అడిగే హక్కు నాకు ఉంటుంది అనడంతో వెంటనే పరంధామయ్య ఆ తాళిని తీసుకెళ్లమని చెబుతాను ఆ దేవుడికి అని అనడంతో అనసూయ షాక్ అవుతుంది. అప్పుడు నందు ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నారు నాన్న అని అనడంతో ఈ ఇంట్లో ఎవరి తోడు నాకు అవసరం లేదు. తులసి దగ్గర ఉన్నప్పుడు గుడిలో ఉన్న ప్రశాంతతను కలిగించింది ఇక్కడికి వచ్చాక స్మశానంలోకి వచ్చినట్టు ఉంది అని అంటాడు పరంధామయ్య.