Janaki Kalaganaledu: కన్నబాబు ఎత్తులు.. రామచంద్ర, జానకికి కష్టాలు.. వంటల పోటీ గెలుపు మాత్రం?

Published : Jun 16, 2022, 01:29 PM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ మంచి పరువుగల కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Janaki Kalaganaledu: కన్నబాబు ఎత్తులు.. రామచంద్ర, జానకికి కష్టాలు.. వంటల పోటీ గెలుపు మాత్రం?

 ఈరోజు ఎపిసోడ్ లో రామచంద్ర(ramachandra)కు డాక్టర్ చికిత్స చేస్తూ ఉండగా అది చూసి కన్నబాబు ఆనంద పడుతూ ఉంటాడు. డాక్టర్ వెళ్ళిపోగానే జ్ఞానాంబ దంపతులు రామచంద్ర గురించి బాధపడుతుంటారు. ఆ తర్వాత జానకి(janaki) డాక్టరు పంపించి వెళుతూ ఉండగా ఇంతలో కన్నబాబు ఎదురుపడి మీ ఆయనకు దెబ్బలు తగిలాయి అంట కదా అందుకే బాధ కలిగి ఇక్కడికి వచ్చాను అంటూ ఏమీ తెలియనట్టుగా వెటకారంగా మాట్లాడుతాడు.
 

26

 మీ ఆయన ఎలా అయినా కచ్చితంగా ఫైనల్ కి వెళ్ళాలి అంటూ దొంగ ప్రేమ చూపిస్తూ ఉంటాడు. ఇక రామచంద్ర (ramachandra )పోటీకి బయలుదేరుతూ ఉండగా ఇంతలో జ్ఞానాంబ(jnanamba)లగేజ్ తీసుకుని ఎంట్రీ ఇస్తుంది. రామ నువ్వు పోటీలకు వెళ్లడం లేదు మనం ఇంటికి వెళ్తున్నాము అని అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
 

36

అప్పుడు గోవిందరాజు(govindaraju )రామచంద్ర ఇద్దరు కలిసి జ్ఞానాంబ కు నచ్చచెప్పడానికి ప్రయత్నించినప్పటికీ జ్ఞానాంబ మాత్రం ఒప్పుకోదు. నాకు పోటీలకంటె నా కొడుకు ప్రాణం ముఖ్యం అని అంటుంది. అప్పుడు రామచంద్ర అమ్మ నేను రాను అంటూ జ్ఞానాంబకు ఎదురు చెప్పడంతో రామ (rama)నువ్వు ఇలా మాట్లాడతావని నేను అనుకోలేదు అని అంటుంది. 
 

46

అప్పుడు రామచంద్ర (ramachandra)ఎమోషనల్ అవుతూ చివరికి జ్ఞానాంబను బలవంతంగా పోటీకి వెళ్ళడం కోసం ఒప్పిస్తాడు. జ్ఞానాంబ పోటీలకు సరే అని అనడంతో గోవిందరాజులు,జానకి(janaki), రామచంద్ర ముగ్గురు కలిసి వెళ్తారు. కాంపిటీషన్ మొదలవుతుంది. అప్పుడు జానకి జడ్జీలను రిక్వెస్ట్ చేస్తూ మా ఆయనకు అనుకోకుండా చిన్న యాక్సిడెంట్ జరిగింది.
 

56

ఎవరో ఒకరు హెల్ప్ చేయడానికి అనుమతి ఇవ్వండి అని అడగగా అందుకు జడ్జిలు ఓకే అని చెప్పడంతో వెంటనే జానకి జ్ఞానాంబ(jnanamba)కు ఫోన్ చేసి పోటీకి రమ్మని చెబుతుంది. అప్పుడు కన్నబాబు అక్కడ ఉన్న తన మనిషికి ఫోన్ చేసి ల్యాండ్ లైన్  వైర్ కట్ చేయిస్తాడు. ఇక జానకి (janaki)ఫోన్ మాట్లాడుతుండగా అనుకోకుండా ఫోన్ కట్ అవుతుంది.
 

66

 మరొకవైపు జ్ఞానాంబ(jnanamba)కోసం పోటీలో అందరూ ఎదురు చూస్తూ ఉండగా, జడ్జిలు రామచంద్ర నీకు ఇచ్చిన అవకాశం పూర్తి అయ్యింది అని అనడంతో జానకి మరొకసారి ప్రాధేయపడి మరొక అవకాశం ఇవ్వమని కోరుతుంది. కానీ జ్ఞానాంబ మాత్రం ఎంతసేపటికి రాదు.

click me!

Recommended Stories