Janaki kalaganaledu: ఆనందంలో జెస్సీ.. మల్లిక నిజస్వరూపం గురించి తెలుసుకున్న జానకి!

Published : Oct 28, 2022, 12:53 PM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు అక్టోబర్ 28వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం..  

PREV
19
Janaki kalaganaledu: ఆనందంలో జెస్సీ.. మల్లిక నిజస్వరూపం గురించి తెలుసుకున్న జానకి!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. జ్ఞానాంబ సున్నుండలు చేస్తూ ఉంటుంది. అప్పుడు పక్కనే ఉన్న చికిత మీది ఎంత మంచి మనసు అమ్మగారు మల్లికమ్మ గారు అంత చేసిన సరే ఏమాత్రం కోప్పడకుండా వాళ్ళ కోసం ఎన్ని చేస్తున్నారు అని అంటుంది. వాళ్ళ మనసులు మంచివి చికిత, బంధాలు మధ్య వచ్చే సమస్యలు వేరు చూసుకోవలసిన బాధ్యత వేరు అని జ్ఞానాంబ అంటుంది. ఇంతలో జానకి అక్కడికి వస్తుంది. జానకి నీ తోటి కోడలు ఇద్దరికీ సున్నుండలు ఇవ్వు పోషణ బాగుంటుంది కడుపులో బిడ్డ ఆరోగ్యం గా ఉంటుంది అని అనగా సరే అని జానకి అవి తీసుకుంటుంది.
 

29

 జెస్సీ గదిలోకి జానకి వెళ్ళగా జెస్సీ ఫోన్లో చిన్నపిల్లల ఫోటోలు చూస్తూ ఉంటుంది. ఏంటి జెస్సి పిల్లల ఫోటోలు చూస్తున్నావా అని జానకి అడగగా, అవునక్కా పిల్లల ఫోటోలు చూస్తే పిల్లలు అందంగా పోషణగా, ఆరోగ్యంగా పుడతారట అని అంటుంది.అప్పుడు డాక్టర్ చెప్పిన మాటలు జానకి గుర్తొచ్చి కొంచెం బాధపడుతుంది.  అప్పుడు సున్నుండలు ఇచ్చి అత్తయ్య గారు నీకు సున్నుండలు ఇవ్వమన్నారు అని అంటుంది. అత్తయ్య గారు ఎంత మంచి వారు అక్క. దేవుడు మనిషి రూపంలో ఉంటాడని ఎప్పుడో విన్నాను కానీ ఇప్పుడే చూడడం అక్క. 
 

39

 నేను తెలుసో తెలియకో అత్తయ్య గారి మనసు బాధపెట్టాను కానీ అత్తయ్య గారు ఎప్పుడూ నన్ను పరాయిదానిలా చూడలేదు చాలా ప్రేమగా చూసుకున్నారు అని అనగా జానకి, అత్తయ్య గారు చాలా మంచివారు మనం ఎప్పుడు అత్తయ్య గారిని బాగా చూసుకోవాలి బాధ పెట్టకూడదని అంటుంది. ఈ మాటలన్నీ జ్ఞానాంబ విని ఆనందపడుతుంది. ఆ తర్వాత జెస్సీ సున్నుండలు తింటుంది. జానకి మల్లిక దగ్గరికి వెళ్దామని అనుకుంటూ, మల్లిక వ్యవహారం బట్టి తను గర్భవతి కాదు అని నాకు అర్థమవుతుంది కానీ నేను ఎలా నిరూపించాలి అని బి కాంప్లెక్స్ టాబ్లెట్లు పట్టుకొని ఇవి మల్లికకి గర్భవతి టాబ్లెట్లు అని ఇస్తాను. 
 

49

ఒకవేళ తను వేసుకోకపోతే తను గర్భవతి కాదు అని తెలుస్తుంది ఒకవేళ వేసుకున్నట్లయితే బీ కాంప్లెక్స్ టాబ్లెట్లు కనుక అంత పెద్ద సమస్య ఏమి ఉండదు అని అనుకుంటూ ఆ టాబ్లెట్లు పట్టుకొని వెళ్తుంది. అదే సమయంలో మల్లిక హాయిగా కూర్చుని ఆనందంగా సమయం గడుపుతుంది. సున్నుండలు తీసుకో మల్లిక అలాగే టాబ్లెట్లు కూడా వేసుకో ఇప్పుడే అని అనగా నువ్వు వెళ్ళు జానకి నేను తిన్న తర్వాత వేసుకుంటాను అని జానకిని పంపించేస్తుంది మల్లిక. అప్పుడు జానకి వెళ్ళిపోయిన తర్వాత మల్లిక సున్నుండలు తింటూ ఆ టాబ్లెట్ ని పక్కన పడేస్తుంది.
 

59

 దాన్ని గమనించిన జానకి ఇన్ని రోజులు అందరితో భలే ఆడుకున్నావు మల్లిక నీ ఆటలో నేను కట్టు పెడతాను అని అనుకుంటుంది. ఆరోజు రాత్రి జానకి చదువుకుంటూ ఉండగా ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఎలా అత్తయ్య గారి ముందు నిరూపించాలి అని అనుకుంటుంది. ఇంతలో రామ అక్కడికి వచ్చి ఏమయింది జానకి గారు అని అనగా, ఇక్కడ ఒక సమస్య వచ్చింది రామా గారు దాన్ని ఎలా పరిష్కరించాలో అర్థం కావడం లేదు అని అంటుంది. ప్రతి దానికి ఒక మూలం ఉంటుంది కదా దాని నుంచి వెళ్ళండి అని రామా అంటాడు.
 

69

 జరిగిన విషయం అంత గుర్తు తెచ్చుకున్న జానకి లీలావతి పిన్నే కదా మల్లికకి గర్భం వచ్చింది అని చెప్పారు. దానివల్లే ఇదంతా మొదలైంది కదా అంటే లీలావతి  పిన్ని కి కూడా ఇందులో చేయి ఉన్నది అనుకోని ఆ తర్వాత రోజు ఉదయాన్నే లీలావతికి ఫోన్ చేస్తుంది. పిన్ని గారు నేను మీతో మాట్లాడాలి త్వరగా ఇంటికి రండి అని అనగా లీలావతి భయపడి, దీనికి ఏమైంది సడన్ గా నాకు ఫోన్ చేసి ఇంటికి రమ్మంటుంది అని అనుకుంటూ, పక్క ఊర్లో తెలిసిన అమ్మాయి పెద్దమనిషి చేయండి జానకి వెళ్లి చూసి దారిలో వస్తాను అని అసలు ఎందుకు రమ్మంటున్నావు అని అడుగుతుంది.
 

79

 రండి పెద్దమ్మ మీకే తెలుస్తుంది అని జానకి అంటుంది. కొంపతీసి మల్లిక కడుపు గురించి తెలిసిపోయింది అనుకుని మల్లికకు లీలావతి ఫోన్ చేయగా మల్లిక పడుకుంటూ ఫోన్ కట్ చేసేస్తుంది. ఇంక ఏం చేసేది లేక లీలావతి జానకి వాళ్ళ ఇంటికి వస్తుంది. అప్పుడు మల్లిక, ఇక్కడికి వచ్చావ్ ఏంటి పెద్దమ్మ అని అనగా, జానకి నన్ను ఇక్కడికి రమ్మన్నది కొంపతీసి నీ కడుపు అబద్ధమని తెలిసిపోయి ఉంటుందా అని అంటుంది. ఈ మాటలన్నీ జానకి పక్క నుంచి వింటుంది. అలా ఏమి అయ్యుండదులే పెద్దమ్మ అనుకుంటూ టాబ్లెట్లు పారేసిన విషయం గుర్తొచ్చి కొంపతీసి జానకి చూసిందా అనుకుంటుంది. 
 

89

అప్పుడు లీలావతి, చూడు మల్లిక ఈ విషయం కానీ ఎవరికైనా తెలిస్తే నన్ను మధ్యలో లాగొద్దు ఇదంతా నువ్వే నాచేత చేపించావని చెప్తాను అని అనగా, చీరలన్ని బానే దొబ్బేసావు కదా. ఇప్పుడు వచ్చి నా మీద తోసేస్తావ్ ఏంటి అయినా ఏం జరగదులే అని అంటుంది. ఇంతలో జ్ఞానాంబ అక్కడికి వస్తుంది. జ్ఞనాంబ పట్టీలు శబ్దం విన్న మల్లిక ఇంత ఉదయాన్నే టీ పొడి కావాలా పెద్దమ్మ తర్వాత రండి అని అంటుంది. అప్పుడు వాళ్ళ మాటలు విన్న జ్ఞానాంబ, లీలావతి టీ పొడి కోసం వచ్చింది అనుకొని అక్కడ నుంచి వెళ్లి తులసి కోట దగ్గర ప్రదక్షిణాలు చేసుకుంటుంది.
 

99

 అప్పుడు జానకి ఆ మాటలు అన్నీ విని అత్తయ్య గారికి ఇదంతా తెలిస్తే చాలా బాధపడతారు ఇప్పుడు ఎలా నిరూపించాలి అని అనుకుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!

Recommended Stories