కోడైకెనాల్ లో జరుగుతున్న విజయ్ దళపతి విజయ్ నటిస్తున్న జన నాయగన్ సినిమా షూటింగ్ ఆగిపోయింది. సూపర్ ఫాస్ట్ గా సాగుతున్న ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ లు పడటానికి కారణం ఏంటి?
విజయ్ రాజకీయాల్లోకి వచ్చాక సినిమాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన తన కెరీర్ లో చివరి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. జన నాయగన్ టైటిల్ తో రూపొందుతున్న ఈసినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది.
24
జన నాయగన్
కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఒక రాప్ పాటను ప్రముఖ రాప్ గాయకుడు హనుమన్ కిండ్ పాడారు.హెచ్ వినోద్ డైరెక్ట్ చేస్తుండగా.. ఈసినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది.
34
జన నాయగన్ కోడైకెనాల్ షూటింగ్
చెన్నై చుట్టుపక్కల కొంత కాల షూటింగ్ జరిగిన ఈసినిమా చివరి దశ షూటింగ్ కోడైకెనాల్‌లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ తో మూవీ షూటింగ్ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు టీమ్.
కోడైకెనాల్‌లోని తాండికుడి ప్రాంతంలో 4 రోజుల పాటు షూటింగ్ జరపాలని ప్లాన్ చేశారు. కాని ఇంతలోనే ఈసినిమా షూటింగ్ కు వరషం కారణంగా బ్రేకులు పడ్డాయి. దాంతో షూటింగ్ కాన్సిల్ అయినట్టు తెలుస్తోంది.