Jana Nayakudu: విజయ్‌ సినిమా ఇంకా రిలీజ్‌ కాలేదు, అప్పుడే కోటి మంది చూశారు.. సీఎంకు షాక్‌

Published : Jul 02, 2026, 05:25 PM IST

Jana Nayakudu: విజయ్ నటించిన 'జన నాయగన్' సినిమా పైరసీ కేసులో మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పైరసీ చేసిన ఈ సినిమాను ఏకంగా 1.2 కోట్ల (12 మిలియన్ల) మంది చూశారని పోలీసులు వెల్లడించారు. 

PREV
15
విజయ్‌ను వీడని వివాదాలు

'జన నాయకుడు' సినిమాకు రిలీజ్‌కు ముందు నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికల ముందు విజయ్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భార్యతో విడాకులు, కెరూరు విషాదం, 'జన నాయగన్' వివాదం వంటివి ఆయన్ను ఇబ్బంది పెట్టాయి.  అన్ని అడ్డంకులను, వివాదాలను దాటుకుని ఆయన జనం మనసు గెలుచుకున్నారు. సీఎం అయ్యారు. అయినా ఆయన సినిమా విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది. 

25
పోలీసుల వాదన ఏంటి?

ఈ మూవీ వివాదానికి సంబంధించిన కేసులో ఇప్పుడు మద్రాస్ హైకోర్టు  కీలక ఆదేశాలు ఇచ్చింది. 'జన నాయగన్' సినిమా పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఇద్దరి బెయిల్ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. పైరసీ చేసిన సినిమాను ఆన్‌లైన్‌లో 12 మిలియన్ల మంది చూశారని పోలీసులు చెప్పిన మాటను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

35
21 మందిపై కేసు నమోదు!

విజయ్ నటించిన 'జన నాయగన్'(జన నాయకుడు) సినిమాను ఆన్‌లైన్‌లో పైరసీ చేశారు. చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఫిర్యాదు మేరకు, చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు 21 మందిపై కేసు ఫైల్ చేసి, కొందరిని అరెస్టు చేశారు. ఈ కేసులో అరెస్టయిన రజనీకాంత్, జయప్రకాశ్ బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే, హైకోర్టు వారి పిటిషన్లను కొట్టివేసింది.

45
పరారీలో ఎంతమంది ఉన్నారు!
ఈ పిటిషన్లు జస్టిస్ సి. కుమరప్పన్ ముందు విచారణకు వచ్చినప్పుడు, 'జన నాయగన్' పైరసీ సినిమాను 12 మిలియన్ల మంది చూశారని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసు శాఖ కోర్టుకు వివరించింది.
55
ఇద్దరికీ దొరకని విడుదల భాగ్యం
అరెస్టయిన ఇద్దరు నిందితులకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పోలీసులు వాదించారు. కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని, అందుకే వారికి బెయిల్ ఇవ్వకూడదని కోరారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి, ఇద్దరి బెయిల్ పిటిషన్లను కొట్టివేశారు.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories