దాదాపు నాలుగైదు గంటలపాటు ఆపరేషన్ జరిగిందని, తాను ఆపరేషన్ థియేటర్ బయటే కూర్చున్నానని, వైద్యులు తన వద్ద ఒక ఫోన్ పెట్టారని, మధ్యలో ఫోన్ వస్తే బ్యాడ్ న్యూస్, ఫోన్ రాలేదంటే గుడ్ న్యూస్. అలాంటి పరిస్థితుల్లో క్షణక్షణం టెన్షన్ పడ్డానని, సినిమా అవకాశాల విషయంలో ఫోన్ రావాలని కోరుకునే తాను, ఆ రోజు మాత్రం ఫోన్ రాకూడని దేవుడిని ప్రార్థించుకున్నానని, లక్కీగా ఐదు గంటల వరకు ఫోన్ రాలేదని, అప్పుడూ ఊపిరి పీల్చుకున్నట్టు తెలిపారు పోసాని కృష్ణమురళీ. తన భార్య ప్రాణాలతో బయటపడిందని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఆ సమయంలో తనకు అండగా నిలిచి సపోర్ట్ చేసిన మహేష్ బాబు, నమ్రత, దర్శకుడు శ్రీనువైట్ల, అలాగే కృష్ణారెడ్డిలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.